Test cricket history
-
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్‌ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించింది లేదు. కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు. షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. -
వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్‌గా
Axar Patel Was 3rd Bowler In Test Cricket history.. టీమిండియా లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అక్షర్ పటేల్ 34 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు సహా 62 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండర్, సౌథీ రూపంలో అక్షర్ 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. చదవండి: Ashwin Vs Nitin Menon: అంపైర్‌తో అశ్విన్ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా? ► కాగా అక్షర్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్ రిచర్డ్సన్, రోడ్ని హగ్‌తో కలిసి అక్షర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఉన్న చార్లి టర్నర్ తొలి నాలుగు టెస్టుల్లో ఆరు సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇక వెర్నన్ ఫిలాండర్, ఫ్రెడ్ స్పోపోర్త్, సిడ్ బార్నెస్, నిక్ కుక్‌లు నాలుగేసి సార్లు ఐదు వికెట్ల మార్క్ సాధించారు. ► ఇంకో విశేషమేమిటంటే డెబ్యూ టెస్టు నుంచి తాను ఆడిన నాలుగు టెస్టుల్లో అక్షర్ ప్రతీ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకముందు ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. చార్లీ టర్నర్ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్ రిచర్డ్సన్(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) ఉన్నారు. తాజాగా అక్షర్ పటేల్ వీరి సరసన నిలిచాడు. చదవండి: Tom Latham Stump Out: రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత.. ► ఇక టీమిండియా తరపున అక్షర్ పటేల్ కంటే ముందు ఎల్. శివరామకృష్ణన్, నరేంద్ర హిర్వాణిలు తొలి నాలుగు టెస్టుల్లో మూడేసి సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను సాధించారు. కాగా ఈ విషయంలో మాత్రం అక్షర్ పటేల్ టీమిండియా తరపున తొలి స్థానంలో నిలిచాడు. -
144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవిష్కరించిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోని గ్లింప్సెస్‌ను పొందుపరుస్తూ ఐసీసీ రూపొందించిన ఈ పోస్టర్లో భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే 1998-99లో పాక్‌పై సాధించిన 10 వికెట్ల ఫీట్‌ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఈ చర్య కుంబ్లేను ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టేనంటూ ఊగిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, 1877లో మెల్బోర్న్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదలుకుని.. నేటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన కొన్ని గ్లింప్సెస్‌తో ఐసీసీ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్, అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండుల్కర్, స్టీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ తదితర దిగ్గజాల ఫొటోలను ముద్రించింది. ఈ విషయంలో ఐసీసీ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ.. కొన్ని అరుదైన ఫీట్లను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదుగా చెప్పుకునే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత సాధించిన అనిల్ కుంబ్లేకు చోటు లభించకపోవడంపై భారతీయ అభిమానులు ఊగిపోతున్నారు. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
టెస్టుల్లో రికార్డు సృష్టించిన లంక బౌలర్
ఢాకా: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తైజూల్ ఇస్లాం వికెట్ పడగొట్టి అత్యధిక వికెట్ల పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉండగా హెరాత్ అధిగమించాడు. ఇప్పటికే 400 వికెట్ల మార్కును దాటిన ఐదో స్పిన్ బౌలర్‌గా హెరాత్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక 89 టెస్టు మ్యాచ్‌లాడిన హెరాత్ 28.17 సగటుతో 415 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హెరాత్ 4వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై 215 పరుగుల తేడాతో లంక భారీ విజయంసాధించింది. ఈ గెలుపుతో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఆటగాడు రోషన్సిల్వా కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ఆఫ్ది సిరీస్‌లు లభించాయి. తొలి ఇన్నింగ్స్: శ్రీలంక 222 ఆలౌట్, బంగ్లాదేశ్ 110 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: శ్రీలంక 226 ఆలౌట్, బంగ్లాదేశ్ 123 ఆలౌట్ -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విండీస్ ప్లేయర్ సునీల్ అంబ్రిస్ తన అరంగేట్ర టెస్టులోనే ఓ అరుదైన చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి టెస్టులో ఎదుర్కొన్న తొలి బంతికే ( గోల్డెన్ డక్ ) హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అంబ్రిస్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు విండీస్‌కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండగా అంబ్రిస్ అధిగమించాడు. సీఎస్ బాహ్ 2003లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్ర మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకు హిట్ వికెట్ అయి ఈ రికార్డు జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తొలి ఇన్నింగ్స్‌లో నీల్ వాగ్నర్ 29 ఓవర్ తొలి బంతిని ఫైన్‌లెగ్ షాట్ ఆడాడు. కానీ అతని ఎడమ కాలు స్టంప్స్‌ను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఎన్నో కలలతో బ్యాటింగ్‌కు దిగిన అంబ్రిస్ దురదృష్టం వెంటాడటంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. -
మూడో 'అతిపెద్ద' ఇన్నింగ్స్!
అబుదాబి: టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్ మరో ఘనతను కూడా సాధించాడు. కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దాదాపు 14 గంటల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఇంగ్లండ్ కు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు హానిఫ్ మహ్మద్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ లు ఉన్నారు. 1958 లో బ్రిడ్జిటౌన్ లో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో 970 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి 337 పరుగులు సాధించిన హనీఫ్ అగ్రస్థానంలో ఉండగా, 1999లో డర్బన్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 878 నిమిషాలు క్రీజ్ లో ఉండి 275 పరుగులను సాధించిన గ్యారీ కిరెస్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కుక్ ఆడిన ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద ఇన్నింగ్స్ గా రికార్డులకెక్కింది.