రంగనా హెరాత్
ఢాకా: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తైజూల్ ఇస్లాం వికెట్ పడగొట్టి అత్యధిక వికెట్ల పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉండగా హెరాత్ అధిగమించాడు. ఇప్పటికే 400 వికెట్ల మార్కును దాటిన ఐదో స్పిన్ బౌలర్‌గా హెరాత్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక 89 టెస్టు మ్యాచ్‌లాడిన హెరాత్ 28.17 సగటుతో 415 వికెట్లు పడగొట్టాడు.
అంతకు ముందు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హెరాత్ 4వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై 215 పరుగుల తేడాతో లంక భారీ విజయంసాధించింది. ఈ గెలుపుతో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఆటగాడు రోషన్‌సిల్వా కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్‌ఆఫ్‌ది సిరీస్‌లు లభించాయి.
తొలి ఇన్నింగ్స్: శ్రీలంక 222 ఆలౌట్, బంగ్లాదేశ్ 110 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: శ్రీలంక 226 ఆలౌట్, బంగ్లాదేశ్ 123 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment