Neil Wagner
-
పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టు ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టెస్టు మ్యాచ్.. అసలు మజా ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో టెస్టు క్రికెట్లో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకముందు 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన జాబితాలో విండీస్‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది కివీస్. ఇంతకముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాకిస్తాన్‌పై నాలుగు పరుగుల తేడాతో అతి తక్కువ మార్జిన్ తేడాతో విజయాలు అందుకుంది. ఇక టెస్టు క్రికెట్లో అతి తక్కువ మార్జిన్‌తో విజయాలు సాధించిన జట్ల జాబితా పరిశీలిస్తే... ► 1993లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ విక్టరీ ► 2023లో ఇంగ్లండ్‌పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ► 2005లో ఆస్ట్రేలియాపై రెండు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 1902లో ఇంగ్లండ్‌పై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం ► 1982లో ఆస్ట్రేలియాపై మూడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 2018లో పాకిస్తాన్‌పై నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం ► 1994లో ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం ► 1885లో ఇంగ్లండ్‌పై ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP — BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023 చదవండి: టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం -
ENG vs NZ: వారెవ్వా రూట్! రివర్స్ స్కూప్ షాట్! వీడియో వైరల్!
England Vs New Zealand Test Series 2022: ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత అతడి బ్యాటింగ్ రోజురోజుకీ మెరుగుపడుతోంది. భారీ స్కోర్లు చేయడంలో రూట్ సఫలమవుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రూట్ బ్యాట్ ఝులిపిస్తున్న విధానం అతడి ఫామ్‌ను చాటుతోంది. మొదటి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచిన రూట్.. ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో టెస్టులో 176 పరుగులతో రాణించాడు. ఇదిలా ఉంటే ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో తడబడ్డా.. రెండో ఇన్నింగ్స్‌లో జోరు ప్రదర్శిస్తున్నాడు రూట్. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా 21.6వ ఓవర్లో అతడు ఆడిన రివర్స్ స్వీప్‌షాట్ హైలెట్‌గా నిలిచింది. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో రూట్ రివర్స్ స్వీప్‌షాట్‌తో సిక్సర్ కొట్టాడు. దీంతో బిక్కమొహం వేయడం వాగ్నర్ వంతైంది. ఇక రూట్ స్టన్నింగ్ షాట్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇక సిరీస్ విషయానికొస్తే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే రెండు గెలిచి సిరీస్‌ను కైవలం చేసుకుంది. చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్ Joe Root. You are ridiculous. Scorecard/clips: https://t.co/AIVHwaRwQv 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/0YIhsZ5T04 — England Cricket (@englandcricket) June 26, 2022 -
WTC Final: పాస్ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు..
వెల్లింగ్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించి స్వదేశానికి చేరుకున్న న్యూజిలాండ్ జట్టుకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించిందని ఆ జట్టు పేసర్ నీల్ వాగ్నర్ వెల్లడించాడు. శుక్రవారం స్వదేశంలో ల్యాండ్ కాగానే అభిమానుల నుంచి భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయని, ఐసీసీ బహుకరించిన గదతో ఫోటోలు దిగేందుకు వారంతా ఎగబడ్డారని ఆయన తెలిపాడు. విమానాశ్రయంలోనూ కస్టమ్స్ అధికారులయితే, పాస్ పోర్టులు లాక్కొని మరీ ఐసీసీ గద కోసం ఆరా తీశారని, గదతో ఫోటోలు దిగేందుకు వారు సైతం అలా ఎగబడడం చూసి చాలా గర్వంగా ఫీలయ్యామని, గదను పట్టుకున్నప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం అద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఈ అనుభూతి వర్ణణాతీతమని, ఛాంపియన్ జట్టుకు ఇంత గౌరవం లభిస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. అయితే, కరోనా నిబంధనల కారణంగా అభిమానులకు దూరం నుంచే అభివాదం చేయాల్సి వచ్చిందని, గదతో ఫోటోలు దిగాలన్న అభిమానుల కోరిక నెరవేరలేదని ఆయన వివరించాడు. అయిప్పటికీ తమ దేశ అభిమానులు ఎంతో సంయమనం పాటించారని, రూల్స్ వ్యతిరేకంగా ప్రవర్తించకుండా హుందాగా వ్యవహరించారని, వారి అభిమానం వెలకట్టలేనిదని తెలిపాడు. జట్టు సభ్యులందరికీ అభిమానులతో కలిసి సంబురాలు చేసుకోవాలని ఉండిందని, అయితే అలాంటి పరిస్థితులు లేకపోవడం బాధించిందని విచారం వ్యక్తం చేశాడు. తాము కూడా రాత్రంతా తలా కాసేపు గదను పట్టుకుని సంబర పడ్డామని, జట్టు వికెట్ కీపర్ వాట్లింగ్‌కు డబ్ల్యూటీసీ ఫైనలే చివరి మ్యాచ్ కావడంతో ఐసోలేషన్ కంప్లీట్ అయ్యేవరకు గదను అతని దగ్గరే ఉంచాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్.. తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ఇందుకు గాను ఆ జట్టుకు రూ.11.67 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు ఐసీసీ.. ఓ గదను బహుకరించింది. చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజ్’ -
WTC Final: గెలుపే లక్ష్యం.. సిరీస్ కూడా మాదే!
ఆక్లాండ్: భారత్‌తో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఫలితంగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లండ్ గడ్డపై వారి సన్నాహకం చాలా మెరుగ్గా ఉండబోతోంది. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా తమ దృష్టిలో ఎంతో విలువుందని కివీస్ ప్రధాన పేసర్ నీల్ వాగ్నర్ అన్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఒక టెస్టు సిరీస్‌లో విజేతగా నిలవడం కూడా అంతే ముఖ్యం. ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుతో టెస్టు మ్యాచ్‌లను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు వామప్ మ్యాచ్‌లుగా చూడటం లేదు. ఆ రెండు టెస్టులు కూడా గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని వాగ్నర్ చెప్పాడు. మరో వైపు న్యూజిలాండ్ జట్టు సభ్యులు ఆది, సోమ వారాల్లో రెండు బృందాలుగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ అనంతరం మాల్దీవుల్లో ఆగిపోయిన విలియమ్సన్, జేమీసన్, సాన్‌ట్నర్ విడిగా ఇంగ్లండ్‌కు పయనమయ్యారు. చదవండి: WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు! ఇంగ్లండ్‌కు భారీ షాక్: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఆర్చర్ దూరం -
జడ్డూ బాయ్ వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్
రవీంద్ర జడేజా.. ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫీల్డింగ్‌తో అవతలి జట్టుకు పరుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో తన మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటాడు. తాజాగా గురువారం త్రోబ్యాక్ థర్స్డే హ్యాష్‌ట్యాగ్ పేరిట జడేజా అందుకున్న అద్భుతమైన క్యాచ్‌ను న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తన ట్విటర్లో షేర్ చేసింది. డీప్స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా వెనక్కి తిరిగి ఒంటిచేత్తో అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఇది జరిగింది ఈ ఏడాదిలోనే.. గత జనవరిలో భారత జట్టు 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. మహ్మద్ షమీ వేసిన బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ నీల్ వాగ్నర్ ఒక బారీ షాట్ ఆడాడు. అందరూ ఆ షాట్ ఫోర్ అనే భావించారు. కానీ అక్కడే ఒక అద్భుతం చోటుచేసుకుంది. డీప్స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా పైకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. జడేజా చేసిన ఫీట్‌కు మిగతా ఆటగాళ్లు బిత్తరపోయారు. బారీ షాట్‌ను వెనక్కి తిరిగి అందుకోవడమే కష్టం.. అలాంటిది ఒంటిచేత్తో అందుకోవడం ఆకట్టుకుంటుంది. (చదవండి : కోహ్లిని ప్రశంసిస్తే తప్పేంటి..) #ThrowbackThursday | "Quite possibly one of the greatest outfield catches in the history of the game!" Do you agree with Ian Smith on this effort from @imjadeja? Test Highlights | https://t.co/fB75C9cKGN #CricketNation #NZvIND pic.twitter.com/R7cs4P9eH2 — BLACKCAPS (@BLACKCAPS) September 2, 2020 ఆ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా ఉన్న ఇయాన్ స్మిత్.. 'జడేజా అందుకున్న క్యాచ్ ఔట్‌ఫీల్డ్ క్యాచ్స్లో ఉత్తమమైనది.. నేను చూసిన వాటిలో ఇదే అత్యుత్తమం.. జడేజా విన్యాసం నిజంగా అద్భుతం.. ' అంటూ కామెంట్ చేశాడు. కానీ జడేజా క్యాచ్ జట్టును గెలిపించలేకపోయింది. ఏడు వికెట్లతో ఆ మ్యాచ్‌ను నెగ్గిన కివీస్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. కివీస్ పర్యటనలో వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌తో కివీస్‌కు అప్పగించిన టీమిండియా టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో ఆతిధ్య జట్టుపై క్లీన్‌స్వీప్ చేయడమొక్కటే సానుకూలాంశంగా చెప్పవచ్చు. ఈ సిరీస్ తర్వాతే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ స్తంభించిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. -
పర్ఫెక్ట్ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ అంటే ఇదే!
క్రైస్ట్‌చర్చ్: రెండో టెస్టులో టీమిండియా వైస్‌కెప్టెన్ అజింక్యా రహానే న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ల మధ్య అసక్తికర సమరం జరిగింది. ఈ సమరంలో రహానేపై వాగ్నర్ పైచేయి సాధించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో టీమిండియాను ఆదుకునే బాధ్యత రహానే-పుజారాలపై పడింది. అయితే రహానేను ఔట్ చేయడానికి కివీస్ పక్కా వ్యూహాలను రచించుకుంది. ఈ వ్యూహాలను అమలు చేసే బాధ్యత వాగ్నర్‌కు సారథి విలియమ్సన్ అప్పగించాడు. పదేపదే లెగ్‌సైడ్, లెగ్ సైడ్ షార్ట్‌పిచ్ బంతులతో రహానేను వాగ్నర్ ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో రహానే హెల్మెట్‌కు అనేక బంతులు తగిలాయి. దీంతో షార్ట్ పిచ్ బంతులను భారీ షాట్లు ఆడాలని రహానే భావించాడు. కానీ అతడి షాట్లు విఫలమవ్వడంతో అనేకమార్లు బంతి గాల్లోకి లేచింది. దీంతో రెండు మూడు మార్లు అతడి అదృష్టం కలిసొచ్చింది. కానీ 31 ఓవర్ మూడో బంతిని ఆడటంలో ఘోరంగా తడబడ్డాడు. వాగ్నర్ వేసిన లెగ్‌సైడ్ బంతిని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైన రహానే ఆ బంతిని వికెట్లపై ఆడి క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో వాగ్నర్ ఆనందంతో ఎగిరిగంతేయగా.. రహానే భారంతో క్రీజు వదిలి వెళ్లాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇదేనని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. చదవండి: అదే బంతి.. బౌలర్ మారాడంతే! సలాం జడ్డూ భాయ్.. -
ఆసీస్‌తో టెస్టు: రెండో బౌలర్‌గా రికార్డు..
మెల్బోర్న్: న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నర్ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ తరఫున వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన వాగ్నర్.. రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా 200వ టెస్టు వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. రిచర్డ్ హ్యాడ్లీ తన 44వ టెస్టులో 200 వికెట్ల మార్కును చేరగా, వాగ్నర్ 46వ టెస్టులో ఆ ఫీట్‌ను అందుకున్నాడు. కివీస్ తరఫున వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో హ్యాడ్లీ, వాగ్నర్ తర్వాత స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్(52 మ్యాచ్‌లు), టిమ్ సౌతీ(56 మ్యాచ్‌లు), క్రిస్ కెయిన్స్(58 మ్యాచ్‌లు)లు ఉన్నారు. జడేజా తర్వాతే వాగ్నర్.. ఇక వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన లెఫ్టార్మ్ బౌలర్ల జాబితాలో కూడా వాగ్నర్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వాగ్నర్ నిలిచాడు. జడేజా తన 44వ టెస్టులో రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఎడమచేతి బౌలర్. ప్రస్తుతం ఆసీస్ జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వాగ్నర్ ఇప్పటివరకూ 13 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో వాగ్నర్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో టెస్టులో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 456 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది. -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విండీస్ ప్లేయర్ సునీల్ అంబ్రిస్ తన అరంగేట్ర టెస్టులోనే ఓ అరుదైన చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి టెస్టులో ఎదుర్కొన్న తొలి బంతికే ( గోల్డెన్ డక్ ) హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అంబ్రిస్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు విండీస్‌కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండగా అంబ్రిస్ అధిగమించాడు. సీఎస్ బాహ్ 2003లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్ర మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకు హిట్ వికెట్ అయి ఈ రికార్డు జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తొలి ఇన్నింగ్స్‌లో నీల్ వాగ్నర్ 29 ఓవర్ తొలి బంతిని ఫైన్‌లెగ్ షాట్ ఆడాడు. కానీ అతని ఎడమ కాలు స్టంప్స్‌ను తాకడంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఎన్నో కలలతో బ్యాటింగ్‌కు దిగిన అంబ్రిస్ దురదృష్టం వెంటాడటంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. -
జింబాబ్వే 164 ఆలౌట్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు బులవాయో: నీల్ వాగ్నర్ (6/41) సంచలన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 77.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటయింది. తొలి రోజు గురువారం... ఒక దశలో 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును పదో నంబర్ బ్యాట్స్‌మన్ డొనాల్డ్ టిరిపానో (162 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు; 1 సిక్స్) ఆదుకున్నాడు. మస్వౌరే (98 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సౌతీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో గప్టిల్ (14 బ్యాటింగ్), లాథమ్ (16 బ్యాటింగ్) ఉన్నారు.