రవీంద్ర జడేజా.. ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫీల్డింగ్‌తో అవతలి జట్టుకు పరుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో తన మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటాడు. తాజాగా గురువారం త్రోబ్యాక్ థర్స్‌డే హ్యాష్‌ట్యాగ్ పేరిట జడేజా అందుకున్న అద్భుతమైన క్యాచ్‌ను న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. డీప్‌స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా వెనక్కి తిరిగి ఒంటిచేత్తో అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది.
ఇది జరిగింది ఈ ఏడాదిలోనే.. గత జనవరిలో భారత జట్టు 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. మహ్మద్ షమీ వేసిన బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ నీల్ వాగ్నర్ ఒక బారీ షాట్ ఆడాడు. అందరూ ఆ షాట్ ఫోర్ అనే భావించారు. కానీ అక్కడే ఒక అద్భుతం చోటుచేసుకుంది. డీప్‌స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా పైకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. జడేజా చేసిన ఫీట్‌కు మిగతా ఆటగాళ్లు బిత్తరపోయారు. బారీ షాట్‌ను వెనక్కి తిరిగి అందుకోవడమే కష్టం.. అలాంటిది ఒంటిచేత్తో అందుకోవడం ఆకట్టుకుంటుంది. (చదవండి : కోహ్లిని ప్రశంసిస్తే తప్పేంటి..)
#ThrowbackThursday | "Quite possibly one of the greatest outfield catches in the history of the game!"
— BLACKCAPS (@BLACKCAPS) September 2, 2020
Do you agree with Ian Smith on this effort from @imjadeja?
Test Highlights | https://t.co/fB75C9cKGN #CricketNation #NZvIND pic.twitter.com/R7cs4P9eH2
ఆ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా ఉన్న ఇయాన్ స్మిత్.. 'జడేజా అందుకున్న క్యాచ్ ఔట్‌ఫీల్డ్ క్యాచ్‌స్‌లో ఉత్తమమైనది.. నేను చూసిన వాటిలో ఇదే అత్యుత్తమం.. జడేజా విన్యాసం నిజంగా అద్భుతం.. ' అంటూ కామెంట్ చేశాడు. కానీ జడేజా క్యాచ్ జట్టును గెలిపించలేకపోయింది. ఏడు వికెట్లతో ఆ మ్యాచ్‌ను నెగ్గిన కివీస్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. కివీస్ పర్యటనలో వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌తో కివీస్‌కు అప్పగించిన టీమిండియా టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో ఆతిధ్య జట్టుపై క్లీన్‌స్వీప్ చేయడమొక్కటే సానుకూలాంశంగా చెప్పవచ్చు. ఈ సిరీస్ తర్వాతే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ స్తంభించిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment