It was a dream delivery for any fast bowler on Ross taylor wicket:ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్బతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్‌ను అద్బుతమైన బంతితో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. కాగా టేలర్‌ను ఔట్ చేసిన బంతి.. తన డ్రీమ్ డెలివరీ అంటూ మ్యాచ్ అనంతరం సిరాజ్ తెలిపాడు. రెండో రోజు ఆటముగిశాక విలేకరుల సమావేశంలో సిరాజ్ మాట్లాడాడు.
“మేము ఇన్‌స్వింగ్ డెలివరీకి తగ్గట్టుగా ఫీల్డ్‌ని పెట్టాము. కానీ నేను తర్వాత నా మనసుని మార్చుకుని అవుట్‌స్వింగ్ బౌలింగ్ ఎందుకు చేయకూడదని అనుకున్నాను. అందుకే అవుట్‌స్వింగ్ డెలివరీ వేశాను. దీంతో టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగలిగాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన సిరాజ్ తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ఇషాంత్ శర్మ స్ధానంలో తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు.
కాగా గాయంనుంచి కోలుకున్నాక.. తను ఫిట్‌నెస్ సాధించాడానికి ఎలా సాధన చేశాడో తెలిపాడు. "నేను గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు వీలైనంత ఎక్కువ స్వింగ్ పొందాలనే లక్ష్యంతో సింగిల్ వికెట్ బౌలింగ్ చేసాను. నాకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తే ఆ విధంగా బౌలింగ్ చేయాలి అనుకున్నాను. సింగిల్ వికెట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ మ్యాచ్‌లో నాకు చాలా ఊపయోగపడింది అని సిరాజ్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..
Absolute peach of a delivery 📦 #Siraj #MiyaanMagic pic.twitter.com/aqU82Ersrr
— King (@DNKWrites) December 4, 2021
Comments
Please login to add a commentAdd a comment