Ind Vs Nz 3rd T20: Ish Sodhi Single Hand Catch In 3rd T20 Match Nz Vs Ind, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ish Sodhi Catch: సోధి సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. రోహిత్‌ శర్మ షాక్‌

Published Mon, Nov 22 2021 8:46 AM | Last Updated on Mon, Nov 22 2021 10:39 AM

Ish Sodhi takes one handed stunner to dismiss Rohit Sharma - Sakshi

Ish Sodhi takes one handed stunner to dismiss Rohit Sharma: భారత్‌తో జరిగిన మూడో టీ20లో కివీస్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోధి స్టన్నింగ్  క్యాచ్‌తో మెరిశాడు. సోధి వేసిన  ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ రెండో బంతిని రోహిత్‌ శర్మ బౌలర్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో సోధి  సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోధి స్టన్నింగ్‌ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా నవంబర్‌21న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. అధేవిదంగా కెప్టెన్‌గా రోహిత్‌కు, కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం.

చదవండి: SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా శ్రీలంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement