జింబాబ్వే 164 ఆలౌట్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
బులవాయో: నీల్ వాగ్నర్ (6/41) సంచలన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 77.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటయింది. తొలి రోజు గురువారం... ఒక దశలో 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును పదో నంబర్ బ్యాట్స్‌మన్ డొనాల్డ్ టిరిపానో (162 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు; 1 సిక్స్) ఆదుకున్నాడు.
మస్వౌరే (98 బంతుల్లో 42; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సౌతీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో గప్టిల్ (14 బ్యాటింగ్), లాథమ్ (16 బ్యాటింగ్) ఉన్నారు.