పాపం​ కేన్‌ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..! | AUS VS NZ 1st Test: Kane Williamson Run Out In Test Cricket For The First Time In 12 Years | Sakshi
Sakshi News home page

AUS VS NZ 1st Test: పాపం​ కేన్‌ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి..!

Published Fri, Mar 1 2024 11:43 AM | Last Updated on Fri, Mar 1 2024 12:15 PM

AUS VS NZ 1st Test: Kane Williamson Run Out In Test Cricket For The First Time In 12 Years - Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్‌ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్‌ నుంచి వస్తున్న సహచరుడు విల్‌ యంగ్‌ను  గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. 

కేన్‌ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్‌ డైరెక్ట్‌ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్‌ రనౌట్‌ కావడానికి ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్‌ పరుగు తీస్తుండగా.. స్టార్క్‌ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్‌ రనౌట్‌ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్‌ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

కాగా, ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్‌ రవీంద్ర, కుగ్గెలిన్‌ డకౌట్లయ్యారు. టామ్‌ లాథమ్‌ (5), విల్‌ యంగ్‌ (9), సౌథీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్‌ ఫిలిప్స్‌ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్‌ బ్లండల్‌ (33), మ్యాట్‌ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్‌ మిచెల్‌ 11 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, స్టార్క్‌, కమిన్స్‌, మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్‌ గ్రీన్‌ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్‌ స్మిత్‌ 31, ఉస్మాన్‌ ఖ్వాజా 33, లబూషేన్‌ 1, హెడ్‌ 1, మిచెల్‌ మార్ష్‌ 40, అలెక్స్‌ క్యారీ 10, స్టార్క్‌ 9, కమిన్స్‌ 16, లయోన్‌ 5, హాజిల్‌వుడ్‌ 22 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్‌ రూర్కీ, కుగ్గెలిన్‌ తలో 2 వికెట్లు, రచిన్‌ రవీంద్ర ఓ వికెట్‌ పడగొట్టాడు.

204 పరుగుల లీడ్‌తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌ కాగా..లబూషేన్‌ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్‌ వాచ్‌మెన్‌ లయెన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement