న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకొని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఔటయ్యాడు. గప్టిల్ తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజులో అడుగుపెట్టాడు. ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు.
ఆ తర్వాత కూడా పెద్దగా ఆడలేదనుకోండి.. కానీ జట్టు టాప్ స్కోరర్‌గా మాత్రం నిలిచాడు. మిచెల్ స్టార్కవేసిన బంతిని విలియమ్సన్ కవర్స్‌లోకి ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండానే వచ్చశాడు. అప్పటికే ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్‌కు బంతి దొరకలేదు. ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లు నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు పరుగు తీశారు. బంతిని అందుకోవడంలో అబాట్ మళ్లీ విఫలమయ్యాడు. అయితే ఈసారి ఇద్దరు బ్యాటర్లు గమ్మత్తుగా స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరుగులు తీశారు. అయితే బంతిని అందుకున్న కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టడంలో సఫలం కాలేకపోయాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ మామ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 25 పరుగులు చేశాడు. అయితే 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో మిచెల్ స్టార్క్(45 బంతుల్లో 38 నాటౌట్), జోష్ హాజిల్‌వుడ్(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇరు జట్లఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న(ఆదివారం) జరగనుంది.
Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD
— cricket.com.au (@cricketcomau) September 8, 2022
చదవండి: AUS Vs NZ 2nd ODI: ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి!
Comments
Please login to add a commentAdd a comment