భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్‌లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు.
ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు.
ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది.
కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment