ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.
ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.
ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.
ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్‌లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.
2021లో రూట్ సెంచరీలు-17
2024లో రూట్ సెంచరీలు-35
2021లో విలియమ్సన్ సెంచరీలు-24
2024లో విలియమ్సన్ సెంచరీలు-32
2021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-26
2024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-32
2021లో కోహ్లి సెంచరీలు-27
2024లో కోహ్లి సెంచరీలు-29
చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment