క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఫ్యాబ్ ఫోర్‌లో బెస్ట్ ఎవరు?
మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.
కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తా
తాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.
మిగతా వాళ్లతో పోలిస్తే
అన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
అతడే నంబర్ వన్
తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్‌కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది.
ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడింది
అదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.
కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా!
చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
Comments
Please login to add a commentAdd a comment