Alyssa Healy
-
WPL 2025: యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 136.57 స్ట్రయిక్‌రేట్‌తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లోని మిగతా మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్‌లు అందుకున్న ఐదో ప్లేయర్‌గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్‌లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్‌లో టి20 వరల్డ్‌కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది. -
ఆస్ట్రేలియా భారీ స్కోర్
వడోదర : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎక్తాబిస్త్కు గాయం భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది. -
ఇంటివారైన స్టార్క్, అలీసా
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ గతేడాది ఏప్రిల్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీకి అలీసా మేనకోడలు. ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతుండగా... స్టార్క్ గాయం కారణంగా రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
తూనీగా... తూనీగా..!
ప్రస్తుత క్రికెట్లో ప్రేమికుల జంట స్టార్క్, అలీసా 15 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిన వైనం ఏప్రిల్ 3, 2014... వేదిక మిర్పూర్... ఆస్ట్రేలియా , వెస్టిండీస్... మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్.. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.. స్లాగ్ ఓవర్లలో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీఐపీ లాంజ్‌లో కూర్చున్న ఓ వ్యక్తి చప్పట్లు చరుస్తూ బ్యాట్స్‌వుమన్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అతని ప్రోత్సాహంతో క్రీజ్‌లో ఉన్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లతో విరుచుకుపడుతోంది. ఆ ఇన్నింగ్సే ఆసీస్ జట్టు విజయానికి కారణమైంది. చివరికి వెస్టిండీస్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ బ్యాట్స్‌వుమన్‌ను ప్రోత్సహించింది ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ స్టార్క్.. ఫోర్లతో విరుచుకుపడింది ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరి కూతురు అలీసా హీలీ... ఇద్దరు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టినా... స్టార్క్ మాత్రం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయి మహిళల జట్టును ప్రోత్సహించడానికి అలీసా హీలీతో ప్రేమాయణమే కారణం.. 24 ఏళ్ల వయసున్న వీళ్లిద్దరూ దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లవ్ ఇన్ సిడ్నీ... మిచెల్ స్టార్క్.. అలీసా హీలీ.. ఒకరికి మరొకరు 15 ఏళ్లుగా పరిచయం.. 9 ఏళ్ల వయసులో సిడ్నీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. వికెట్ కీపర్లుగా ఇద్దరూ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆరేళ్ల పాటు ఒకే జట్టుతో కలసి క్రికెట్ ఆడారు. స్టార్క్ వికెట్ కీపింగ్ వదిలేసి పేస్ బౌలింగ్‌పై దృష్టి పెట్టగా.. అలీసా మాత్రం వికెట్ కీపింగ్నే కొనసాగించింది. 15 ఏళ్ల వయసులో అలీసా మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ చిన్ననాటి పరిచయాన్ని కొనసాగించారు. క్రికెట్‌నే ప్రొఫెషనల్‌గా ఎంచుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించారు. 2011లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు భారత పర్యటనకు వెళ్లేముందు దొరికిన కాస్త సమయం వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని తెలిసేలా చేసింది. అయితే చిన్ననాటి పరిచయం ప్రేమగా మారింది మాత్రం 2012లోనే.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు.. అప్పటి నుంచి ప్రేమపక్షులుగా మారిపోయారు. ఓ వైపు క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా... మరోవైపు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు.