ప్రస్తుత క్రికెట్‌లో ప్రేమికుల జంట స్టార్క్, అలీసా 15 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిన వైనం
ఏప్రిల్ 3, 2014...
వేదిక మిర్పూర్...
ఆస్ట్రేలియా , వెస్టిండీస్...
మహిళల టి20 ప్రపంచకప్
తొలి సెమీఫైనల్.. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.. స్లాగ్ ఓవర్లలో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీఐపీ లాంజ్‌లో కూర్చున్న ఓ వ్యక్తి చప్పట్లు చరుస్తూ బ్యాట్స్‌వుమన్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అతని ప్రోత్సాహంతో క్రీజ్‌లో ఉన్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లతో విరుచుకుపడుతోంది. ఆ ఇన్నింగ్సే ఆసీస్ జట్టు విజయానికి కారణమైంది. చివరికి వెస్టిండీస్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
ఆ బ్యాట్స్‌వుమన్‌ను ప్రోత్సహించింది ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ స్టార్క్.. ఫోర్లతో విరుచుకుపడింది ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరి కూతురు అలీసా హీలీ... ఇద్దరు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టినా... స్టార్క్ మాత్రం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయి మహిళల జట్టును ప్రోత్సహించడానికి అలీసా హీలీతో ప్రేమాయణమే కారణం.. 24 ఏళ్ల వయసున్న వీళ్లిద్దరూ దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.
లవ్ ఇన్ సిడ్నీ...
మిచెల్ స్టార్క్.. అలీసా హీలీ.. ఒకరికి మరొకరు 15 ఏళ్లుగా పరిచయం.. 9 ఏళ్ల వయసులో సిడ్నీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. వికెట్ కీపర్లుగా ఇద్దరూ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆరేళ్ల పాటు ఒకే జట్టుతో కలసి క్రికెట్ ఆడారు. స్టార్క్ వికెట్ కీపింగ్ వదిలేసి పేస్ బౌలింగ్‌పై దృష్టి పెట్టగా.. అలీసా మాత్రం వికెట్ కీపింగ్‌నే కొనసాగించింది. 15 ఏళ్ల వయసులో అలీసా మహిళల క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ చిన్ననాటి పరిచయాన్ని కొనసాగించారు. క్రికెట్‌నే ప్రొఫెషనల్‌గా ఎంచుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించారు.
2011లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు భారత పర్యటనకు వెళ్లేముందు దొరికిన కాస్త సమయం వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని తెలిసేలా చేసింది. అయితే చిన్ననాటి పరిచయం ప్రేమగా మారింది మాత్రం 2012లోనే.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు.. అప్పటి నుంచి ప్రేమపక్షులుగా మారిపోయారు. ఓ వైపు క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా... మరోవైపు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు.
తూనీగా... తూనీగా..!
Published Fri, May 2 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement