Womens T-20 World Cup
-
T20 WC: ‘కెప్టెన్సీకి కఠిన సవాలు.. ఈసారైనా ట్రోఫీ గెలవాలి’
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలుకాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.మనదైన రోజు ఏదైనా సాధ్యమేఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్‌ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.భావోద్వేగాలను అదుపు చేసుకోవాలిప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. చదవండి: DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో) -
పాకిస్తాన్ అల్రౌండర్ అరుదైన ఘనత.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా
పాకిస్తాన్ మహిళల జట్టు స్టార్ నిధా ధార్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిధాదార్ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టిన నిధా.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు 130 మ్యాచ్‌లు ఆడిన ఆమె 126 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ అనీషా మహ్మద్(125) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మహ్మద్ రికార్డును నిధా ధార్ బ్రేక్ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజాయం పాలైంది. చదవండి: T20 WC 2023: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా! -
అమ్మాయిలు అదరగొట్టేశారు
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై శుభారంభం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు గ్రూప్ ‘ఎ’లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్‌లో షఫాలీ మెరిపించగా... బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ మళ్లీ ప్రత్యర్థిని తిప్పేసింది. దీంతో భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీఫైనల్ దిశగా అడుగు ముందుకేసింది. పెర్త్: ఆల్‌రౌండ్ ప్రతాపంతో భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) మళ్లీ ఆకట్టుకుంది. షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దాంతో షఫాలీ టి20 ప్రపంచకప్ చరిత్రలో పిన్న వయస్సులో (16 ఏళ్ల 27 రోజులు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 27న మెల్బోర్న్లో న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుంది. షఫాలీ సిక్సర్లు... భారత టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ సిక్సర్లతో దంచేసింది. దీంతో స్కోరు శరవేగంగా కదిలింది. జ్వరం కారణంగా రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. తానియా భాటియా ఓపెనర్‌గా వచ్చినా 2 పరుగులే చేసి అవుటైంది. అయితే షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మెరుపులు మెరిపించింది. భారత్ 5.1 ఓవర్లోనే 50 పరుగులను చేరుకుంది. ఆమె అవుటయ్యాక స్కోరు మందగించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (8), దీప్తి శర్మ (11)లు పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. కానీ చివర్లో వేద కృష్ణమూర్తి (11 బంతుల్లో 20 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. దీంతో ప్రత్యర్థి ముందు సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఉంచగలిగింది. క్రమం తప్పని పతనం... తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే వికెట్లను పారేసుకుంది. దీంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు కన్నెత్తి చూడలేదు. ఓపెనర్ ముర్షిదా ఖాతున్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు), మిడిలార్డర్లో నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగలిగారు. మిగతా వాళ్లను భారత బౌలర్లు సులభంగానే బోల్తా కొట్టించడంతో క్రమం తప్పకుండా బంగ్లాదేశ్ వికెట్లు పతనమయ్యాయి. శిఖా పాండే, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. రాజేశ్వరి గైక్వాడ్‌కు ఒక వికెట్ దక్కింది. సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: తానియా (స్టంప్డ్) నిగర్ (బి) సల్మా 2; షఫాలీ వర్మ (సి) షమీమా (బి) పన్నా ఘోష్ 39; రోడ్రిగ్స్ (రనౌట్) 34; హర్మన్‌ప్రీత్ (సి) రుమానా (బి) పన్నా ఘోష్ 8; దీప్తి శర్మ (రనౌట్) 11; రిచా (సి) నహీదా అక్తర్ (బి) సల్మా 14; వేద (నాటౌట్) 20; శిఖా పాండే (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–16, 2–53, 3–78, 4–92, 5–111, 6–113. బౌలింగ్: జహనారా 4–0–33–0, సల్మా 4–0–25–2, నహీదా అక్తర్ 4–0–34–0, పన్నా ఘోష్ 4–0–25–2, రుమానా 2–0–8–0, ఫాహిమా 2–0–16–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: షమీమా సుల్తానా (సి) దీప్తి (బి) శిఖా 3; ముర్షిదా (సి) రిచా (బి) అరుంధతి రెడ్డి 30; సంజిదా ఇస్లామ్ (సి) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; నిగర్ సుల్తానా (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35; ఫర్జానా హక్ (సి) తానియా (బి) అరుంధతి రెడ్డి 0; ఫాహిమా (సి) షఫాలీ (బి) పూనమ్ యాదవ్ 17; జహనార (స్టంప్డ్) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; రుమానా (బి) శిఖా 13; సల్మా (నాటౌట్) 2; నహీదా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–5, 2–44, 3–61, 4–66, 5–94, 6–106, 7–108, 8–121. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–32–0, శిఖా పాండే 4–0–14–2, రాజేశ్వరి 4–0–25–1, అరుంధతి 4–0–33–2, పూనమ్ 4–0–18–3. -
సఫారీ అమ్మాయిల చరిత్ర
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా ఈవెంట్లో సఫారీ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఓపెనర్ జోన్స్ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్ నికెర్క్ (2/20), మరిజనె (2/19) సమష్టిగా దెబ్బతీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్, కెప్టెన్ వాన్ నికెర్క్ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీసింది. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రంట్ వేసిన ఆ ఓవర్లోని 3, 4 బంతుల్ని డు ప్రీజ్ వరుసగా 6, 4 బాదడంతో 2 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. -
సంవత్సరం ముందుగా...
దుబాయ్: మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సరిగ్గా ఏడాది ముందుగా మొదలు పెట్టడం విశేషం. నేటి నుంచి ఆన్లైన్లో ఫైనల్ సహా 23 మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఐసీసీ అధికారిక వెబ్సైట్ ్ట20ఠీౌట ఛీఛిup.ఛిౌఝ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్ టికెట్ల కనీస ధరను 20 డాలర్లు (సుమారు రూ.1500)గా నిర్ణయించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలోని ఆరు నగరాల్లో జరుగుతుంది. ప్రధాన టోర్నీకి ముందు ఫిబ్రవరి 16నుంచి 20 వరకు వామప్ మ్యాచ్‌లు ఉంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మెల్బోర్న్లోని ఎంసీజీలో జరిగే ఫైనల్‌కు 92 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని ఐసీసీ అంచనా వేస్తోంది. -
మంధనాధన్.. స్మృతి సుడిగాలి ఇన్నింగ్స్!
జట్టు సెమీఫైనల్ చేరినా...కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్ చాటుకున్నా... స్పిన్నర్లు మాయాజాలంతో కట్టిపడేస్తున్నా... టీమిండియాకు ఒక్క లోటు కనిపించింది! అదే మెరుపు తీగ స్మృతి మంధాన బ్యాట్ నుంచి తుఫాన్ ఇన్నింగ్స్ లేకపోవడం! ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌లోఈ ముచ్చటా తీరింది...!స్మృతి అసలు సిసలు ధాటైన ఆట బయటకు వచ్చింది. అంతే... మిగతాదంతా ఎప్పటిలాగే సాగిపోయింది. భారత్ జోరుకు కంగారూలు తోకముడిచారు. ప్రావిడెన్స్: మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మరో ఘన విజయం. ఎడమ చేతివాటం ఓపెనర్ స్మృతి మంధాన (55 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు స్పిన్నర్ల మాయాజాలం తోడైన వేళ కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మన జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతికి తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్ (3/15), రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/28), దీప్తిశర్మ (2/24) ఉచ్చులో చిక్కిన ఆసీస్ 19.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో సెమీస్ చేరిన వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో ఒకదానితో తలపడనుంది. అహో స్మృతి... హర్మన్ హల్చల్ భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరే రెండంకెల పరుగులు చేశారు. అయినా, జట్టు అంత స్కోరుకు వెళ్లిందంటే కారణం స్మృతి, హర్మన్‌ప్రీత్. ఓపెనర్‌గా వచ్చిన తాన్యా భాటియా (2) సహా విధ్వంసక జెమీమా రోడ్రిగ్స్ (6), వేదా కృష్ణమూర్తి (3) నిరాశపర్చినా, వీరిద్దరి వీర విహారంతో ఆ ప్రభావం కనిపించలేదు. ముందునుంచే జోరు చూపిన స్మృతికి... హర్మన్ రాకతో మరింత బలం వచ్చినట్లైంది. ఇద్దరిలో కెప్టెనే ధాటిగా ఆడింది. మంచి టైమింగ్‌తో బౌండరీలు, భారీ సిక్స్‌లు కొట్టింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 68 పరుగులు రాబట్టడంతో 13.2 ఓవర్లలో జట్టు స్కోరు 117/2కు చేరింది. పరిస్థితి చూస్తే టీమిండియా 180 పైనే లక్ష్యం విధించేలా కనిపించింది. అయితే, కిమ్మిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన హర్మన్... మరో షాట్‌కు యత్నించి అవుటైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంధాన దూకుడు కొనసాగించింది. ఈ క్రమంలో శతకం అందుకుంటుదేమో అనిపించింది. కానీ, షుట్ ఓవర్లో లాంగాన్ వైపు ఆమె కొట్టిన షాట్‌ను ఎలీస్ పెర్రీ క్యాచ్ పట్టి ఆ అవకాశం లేకుండా చేసింది. లోయరార్డర్ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో చివరి ఐదు ఓవర్లలో భారత్ 39 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్ల జోరు... భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలీసా హీలీ... భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడి బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆసీస్ ముందే డీలాపడింది. ఓపెనర్లు ఎలీసా విలానీ (6), బెతానీ మూనీ (19)లను వరుస బంతుల్లో ఔట్ చేసి దీప్తిశర్మ మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చింది. ఆష్లే గార్డ్నర్ (20), రాచెల్ హేన్స్ (8)లను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ మెఘాన్ లానింగ్ (10)ను రాధా యాదవ్ వెనక్కు పంపింది. పెర్రీ బ్యాట్ ఝళిపించినా అప్పటికే పరిస్థితి ఆసీస్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ మిథాలీ రాజ్‌కు విశ్రాంతినిచ్చింది. పేసర్ మాన్సి జోషి స్థానంలో తెలుగమ్మాయి అరుంధతీరెడ్డిని ఆడించింది. మరో పేసర్ పూజా వస్త్రకర్ గాయంతో ప్రపంచ కప్‌నకు దూరమైంది. ►7 భారత్‌కు టి20ల్లో ఇది వరుసగా ఏడో విజయం. గతంలో రెండు సార్లు వరుసగా ఆరేసి మ్యాచ్‌లు నెగ్గింది. ►4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు అందుకున్న రెండో ఫీల్డర్ వేద కృష్ణమూర్తి ►1 మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. దీనికిముందు భారత్ ఆడిన 24 మ్యాచ్‌ల్లోనూ మిథాలీ భాగంగా ఉంది. ►31 టి20 ప్రపంచ కప్‌లో స్మృతి మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లో సాధించింది. -
ఆసీస్.. అదుర్స్
► ఫైనల్లోకి ప్రవేశం ► చేజేతులా ఓడిన ఇంగ్లండ్ ► మహిళల టి20 ప్రపంచకప్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లక్ష్యం 20 ఓవర్లలో 133 పరుగులు.. ఓ దశలో జట్టు స్కోరు 90/2... ఇక గెలవాలంటే 36 బంతుల్లో 43 పరుగులు చేయాలి.. చేతిలో ఎనిమిది వికెట్లూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో సింగిల్స్, డబుల్స్ తీసినా సులువుగా లక్ష్యాన్ని చేరొచ్చు. కానీ ఈ సమయంలోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బౌలింగ్‌లో తడఖా చూపెట్టింది. కట్టుదిట్టమైన బంతులతో 28 పరుగుల తేడాలో కీలకమైన ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో బుధవారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ పోరుకి దూసుకెళ్లింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. లాన్నింగ్ (50 బంతుల్లో 55; 6 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు), బీమౌంట్ (40 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అందరూ విఫలమయ్యారు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరంకాగా, 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. షుట్ 2 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. -
వెస్టిండీస్xన్యూజిలాండ్
మహిళల రెండో సెమీస్ నేడు ముంబై: వాంఖడే స్టేడియంలోనే పురుషుల మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ మహిళల జట్టు కూడా సెమీఫైనల్ ఆడనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలో ఆస్ట్రేలియాపై సహా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లో ఉంది. -
సెమీస్ ఆశలు గల్లంతు!
► వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మిథాలీసేన ► 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు ► మహిళల టి20 ప్రపంచకప్ ధర్మశాల: సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి నాకౌట్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మంచి సమన్వయంతో ఆడిన ఇంగ్లండ్ మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 90 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు), మిథాలీ రాజ్ (33 బంతుల్లో 20; 2 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. హీథర్ నైట్ 3 వికెట్లు తీసింది. తర్వాత ఇంగ్లండ్ 19 ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులు చేసింది. బీమోంట్ (18 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. స్కివెర్ (19), టేలర్ (16) ఓ మోస్తరుగా ఆడారు. భారత బౌలర్లు ఆరంభంలో విజృంభించినా.. చివర్లో ఫీల్డింగ్‌లో కొంప ముంచారు. విజయానికి 3 పరుగులు చేయాల్సిన దశలో శుబ్స్రోల్ (5 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను మిథాలీ జారవిడిచింది. ఆ తర్వాతి బంతికి ఆమె ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ సొంతమైంది. బిస్త్ 4 వికెట్లు తీసింది. స్కోరు వివరాలు: భారత్ మహిళల ఇన్నింగ్స్: వనిత (సి) గ్రీన్వే (బి) నైట్ 0; మందన (బి) శ్రుబ్సోల్ 12; మిథాలీ (సి) గ్రీన్వే (బి) స్కివెర్ 20; శిఖా పాండే (సి) బ్రూంట్ (బి) నైట్ 12; హర్మన్‌ప్రీత్ రనౌట్ 26; వేద కృష్ణమూర్తి (బి) నైట్ 2; గోస్వామి (సి) టేలర్ (బి) శ్రుబ్సోల్ 2; అనుజా పాటిల్ రనౌట్ 13; బిస్త్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1-0; 2-15; 3-44; 4-47; 5-52; 6-65; 7-87; 8-90. బౌలింగ్: నైట్ 4-0-15-3; బ్రూంట్ 4-0-24-0; శ్రుబ్సోల్ 4-0-12-2; గున్ 4-0-16-0; గ్రుండె 2-0-14-0; స్కివెర్ 2-0-7-1. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: ఎడ్వర్డ్స్ (సి) వర్మ (బి) బిస్త్ 4; బిమోంట్ (సి) అనుజా (బి) కౌర్ 20; టేలర్ (స్టం) వర్మ (బి) కౌర్ 16; నైట్ (స్టం) వర్మ (బి) బిస్త్ 8; స్కివెర్ (సి) మిథాలీ (బి) బిస్త్ 19; గ్రీన్వే ఎల్బీడబ్ల్యు (బి) బిస్త్ 0; యాట్ రనౌట్ 5; బ్రూంట్ నాటౌట్ 4; గున్ రనౌట్ 7; శ్రుబ్సోల్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (19 ఓవర్లలో 8 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1-10; 2-42; 3-42; 4-62; 5-62; 6-71; 7-79; 8-87. బౌలింగ్: అనుజా 4-0-22-0; జులన్ 2-0-10-0; బిస్త్ 4-0-21-4; రాజేశ్వరి 4-1-10-0; హర్మన్‌ప్రీత్ 4-0-22-2; వేద 1-0-4-0. -
భారత్ ఆశలపై వర్షం
► డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ► 2 పరుగులతో పాకిస్తాన్ విజయం ► మహిళల టి20 ప్రపంచకప్ న్యూఢిల్లీ: చేసింది కేవలం 96 పరుగులే... అయినా భారత మహిళలు పోరాడారు. ఓ దశలో అలవోక విజయం దిశగా సాగుతున్న పాకిస్తాన్ మహిళలను కట్టడి చేశారు. పది బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు తెచ్చుకున్నారు. ఇక పాకిస్తాన్ విజయం కోసం 24 బంతుల్లో 20 పరుగులు చేయాలి. క్రీజులో మిగిలిన వాళ్లంతా బౌలర్లు. కాబట్టి భారత్ గెలుపు అవకాశాలు బాగా పెరిగాయి. ఇలాంటి స్థితిలో వరుణుడు మిథాలీసేన ఆశలపై నీళ్లుజల్లాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగులతో విజయం సాధించింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గట్టెక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 96 పరుగులు చేశారు. వేద కృష్ణమూర్తి (19 బంతుల్లో 24; 3 ఫోర్లు) రాణించగా... మిథాలీ (35 బంతుల్లో 16; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (19 బంతుల్లో 16; 2 ఫోర్లు), జులన్ గోస్వామి (14 బంతుల్లో 14) మోస్తరుగా ఆడారు. మిథాలీ, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 29; వేద, గోస్వామి ఐదో వికెట్‌కు 22 పరుగులు సమకూర్చడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం పాకిస్తాన్ 16 ఓవర్లలో 6 వికెట్లకు 77 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. నహిదా ఖాన్ (14), మునీబా అలీ (12 నాటౌట్), ఇరామ్ జావేద్ (10) పోరాడారు. ఆరంభంలో విఫలమైన భారత బౌలర్లు చివర్లో మాత్రం విజృంభించారు. ఓ దశలో 70/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీయడంతో స్కోరు 77/6గా మారింది. ఈ దశలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. చివరకు డక్‌వర్త్ పద్ధతిలో పాక్‌కు స్వల్ప విజయం దక్కింది. అనమ్ అమిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: మిథాలీ (సి) సిద్రా అమిన్ (బి) నిడా దర్ 16; వనిత (సి) సనా మిర్ (బి) అనమ్ అమిన్ 2; మందన ఎల్బీడబ్ల్యు (బి) అస్మవి ఇక్బాల్ 1; హర్మన్‌ప్రీత్ (సి) సిద్రా అమిన్ (బి) సాడియా యూసుఫ్ 16; వేద కృష్ణమూర్తి (సి అండ్ బి) సనా మిర్ 24; జులన్ గోస్వామి రనౌట్ 14; అనుజా పాటిల్ రనౌట్ 3; శిఖా పాండే నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1-3; 2-5; 3-34; 4-49; 5-71; 6-80; 7-96. బౌలింగ్: అనమ్ అమిన్ 4-0-9-1; అస్మవి ఇక్బాల్ 4-0-13-1; సనా మిర్ 4-0-14-1; సాడియా యూసుఫ్ 3-0-24-1; బిస్మా మహరూఫ్ 2-0-12-0; నిడా డర్ 3-0-23-1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: నహిదా ఖాన్ (సి) కౌర్ (బి) పాండే 14; సిద్రా అమిన్ (బి) గైక్వాడ్ 26; బిస్మా (సి) గోస్వామి (బి) కౌర్ 5; మునీబా నాటౌట్ 12; ఇరామ్ జావేద్ (సి) మిథాలీ (బి) గోస్వామి 10; అస్మావి ఇక్బాల్ రనౌట్ 5; సనా మిర్ రనౌట్ 0; నిడా డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (16 ఓవర్లలో 6 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1-19; 2-48; 3-50; 4-71; 5-77; 6-77. బౌలింగ్: అనుజా పాటిల్ 3-0-14-0; రాజేశ్వరి గైక్వాడ్ 2-0-11-1; శిఖా పాండే 2-0-14-1; జులన్ గోస్వామి 4-0-14-1; పూనమ్ యాదవ్ 3-0-14-0; హర్మన్‌ప్రీత్ 2-0-9-1. -
బంగ్లాదేశ్‌కు మరో ఓటమి
► 36 పరుగులతో ఇంగ్లండ్ విజయం ► మహిళల టి20 ప్రపంచకప్ బెంగళూరు: మహిళల టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 36 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (51 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా చివర్లో బ్రంట్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు), వ్యాట్ (8 బంతుల్లో 15; 2 ఫోర్లు) వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచారు. జహనర్ ఆలమ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓడింది. నిగర్ సుల్తానా (28 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్), సల్మా ఖటూన్ (30 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. -
తూనీగా... తూనీగా..!
ప్రస్తుత క్రికెట్లో ప్రేమికుల జంట స్టార్క్, అలీసా 15 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిన వైనం ఏప్రిల్ 3, 2014... వేదిక మిర్పూర్... ఆస్ట్రేలియా , వెస్టిండీస్... మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్.. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.. స్లాగ్ ఓవర్లలో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీఐపీ లాంజ్‌లో కూర్చున్న ఓ వ్యక్తి చప్పట్లు చరుస్తూ బ్యాట్స్‌వుమన్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అతని ప్రోత్సాహంతో క్రీజ్‌లో ఉన్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లతో విరుచుకుపడుతోంది. ఆ ఇన్నింగ్సే ఆసీస్ జట్టు విజయానికి కారణమైంది. చివరికి వెస్టిండీస్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ బ్యాట్స్‌వుమన్‌ను ప్రోత్సహించింది ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ స్టార్క్.. ఫోర్లతో విరుచుకుపడింది ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరి కూతురు అలీసా హీలీ... ఇద్దరు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టినా... స్టార్క్ మాత్రం బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయి మహిళల జట్టును ప్రోత్సహించడానికి అలీసా హీలీతో ప్రేమాయణమే కారణం.. 24 ఏళ్ల వయసున్న వీళ్లిద్దరూ దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లవ్ ఇన్ సిడ్నీ... మిచెల్ స్టార్క్.. అలీసా హీలీ.. ఒకరికి మరొకరు 15 ఏళ్లుగా పరిచయం.. 9 ఏళ్ల వయసులో సిడ్నీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. వికెట్ కీపర్లుగా ఇద్దరూ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆరేళ్ల పాటు ఒకే జట్టుతో కలసి క్రికెట్ ఆడారు. స్టార్క్ వికెట్ కీపింగ్ వదిలేసి పేస్ బౌలింగ్‌పై దృష్టి పెట్టగా.. అలీసా మాత్రం వికెట్ కీపింగ్నే కొనసాగించింది. 15 ఏళ్ల వయసులో అలీసా మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ చిన్ననాటి పరిచయాన్ని కొనసాగించారు. క్రికెట్‌నే ప్రొఫెషనల్‌గా ఎంచుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించారు. 2011లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు భారత పర్యటనకు వెళ్లేముందు దొరికిన కాస్త సమయం వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని తెలిసేలా చేసింది. అయితే చిన్ననాటి పరిచయం ప్రేమగా మారింది మాత్రం 2012లోనే.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు.. అప్పటి నుంచి ప్రేమపక్షులుగా మారిపోయారు. ఓ వైపు క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా... మరోవైపు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. -
భారత్ బోణి
మహిళల టి20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌పై గెలుపు సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. సిల్హెట్లో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మిథాలీ సేన 79 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 8 వికెట్లకు 72 పరుగులే చేసింది. రాణించిన హర్మన్‌ప్రీత్, మిథాలీ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త ఆటతో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన భారత జట్టు, బంగ్లాతో మ్యాచ్‌లో సమష్టిగా ఆడింది. ఓపెనర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (59 బంతుల్లో 77; 12 ఫోర్లు, 1 సిక్సర్), మిథాలీ రాజ్ (38 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 107 పరుగులు జోడించారు. ఆ తర్వాత జులన్ గోస్వామి (3/11), శుభ్‌లక్ష్మి శర్మ (3/12), పూనమ్ యాదవ్ (2/10) ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.