సెమీస్ ఆశలు గల్లంతు! | After losing the second match in a row mithalisena | Sakshi
Sakshi News home page

సెమీస్ ఆశలు గల్లంతు!

Published Wed, Mar 23 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

సెమీస్ ఆశలు గల్లంతు!

సెమీస్ ఆశలు గల్లంతు!

వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మిథాలీసేన
2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
మహిళల టి20 ప్రపంచకప్

 
ధర్మశాల: సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి నాకౌట్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మంచి సమన్వయంతో ఆడిన ఇంగ్లండ్ మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో  2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 90 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు), మిథాలీ రాజ్ (33 బంతుల్లో 20; 2 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు.

హీథర్ నైట్ 3 వికెట్లు తీసింది.  తర్వాత ఇంగ్లండ్ 19 ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులు చేసింది. బీమోంట్ (18 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. స్కివెర్ (19), టేలర్ (16) ఓ మోస్తరుగా ఆడారు. భారత బౌలర్లు ఆరంభంలో విజృంభించినా.. చివర్లో ఫీల్డింగ్‌లో కొంప ముంచారు. విజయానికి 3 పరుగులు చేయాల్సిన దశలో శుబ్‌స్రోల్ (5 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను మిథాలీ జారవిడిచింది. ఆ తర్వాతి బంతికి ఆమె ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ సొంతమైంది. బిస్త్ 4 వికెట్లు తీసింది.

స్కోరు వివరాలు: భారత్ మహిళల ఇన్నింగ్స్: వనిత (సి) గ్రీన్‌వే (బి) నైట్ 0; మందన (బి) శ్రుబ్‌సోల్ 12; మిథాలీ (సి) గ్రీన్‌వే (బి) స్కివెర్ 20; శిఖా పాండే (సి) బ్రూంట్ (బి) నైట్ 12; హర్మన్‌ప్రీత్ రనౌట్ 26; వేద కృష్ణమూర్తి (బి) నైట్ 2; గోస్వామి (సి) టేలర్ (బి) శ్రుబ్‌సోల్ 2; అనుజా పాటిల్ రనౌట్ 13; బిస్త్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 90.

వికెట్ల పతనం: 1-0; 2-15; 3-44; 4-47; 5-52; 6-65; 7-87; 8-90. బౌలింగ్: నైట్ 4-0-15-3; బ్రూంట్ 4-0-24-0; శ్రుబ్‌సోల్ 4-0-12-2; గున్ 4-0-16-0; గ్రుండె 2-0-14-0; స్కివెర్ 2-0-7-1.

ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: ఎడ్వర్డ్స్ (సి) వర్మ (బి) బిస్త్ 4; బిమోంట్ (సి) అనుజా (బి) కౌర్ 20; టేలర్ (స్టం) వర్మ (బి) కౌర్ 16; నైట్ (స్టం) వర్మ (బి) బిస్త్ 8; స్కివెర్ (సి) మిథాలీ (బి) బిస్త్ 19; గ్రీన్‌వే ఎల్బీడబ్ల్యు (బి) బిస్త్ 0; యాట్ రనౌట్ 5; బ్రూంట్ నాటౌట్ 4; గున్ రనౌట్ 7; శ్రుబ్‌సోల్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (19 ఓవర్లలో 8 వికెట్లకు) 92.

వికెట్ల పతనం: 1-10; 2-42; 3-42; 4-62; 5-62; 6-71; 7-79; 8-87. బౌలింగ్: అనుజా 4-0-22-0; జులన్ 2-0-10-0; బిస్త్ 4-0-21-4; రాజేశ్వరి 4-1-10-0; హర్మన్‌ప్రీత్ 4-0-22-2; వేద 1-0-4-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement