Anuja
-
అక్కా చెల్లెళ్లు! కల నిజం చేసుకున్నారు..
ప్రతి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపిస్తున్నారు అనుజా గుప్తా, ప్రతాంక్షా గుప్తా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఢిల్లీవాసులైన వీరిద్దరూ ఐదేళ్ల క్రితం లక్షరూపాయలతో చికన్‌కారీ కుర్తీల వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు 45 మంది ఉద్యోగులతో, ఐదుకోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఒడిదొడుకులను అధిగమిస్తూ వ్యాపారంలో మైలురాళ్లను అధిగమిస్తున్నారు.అనుజా గుప్తా మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన అక్కాచెల్లెళ్లం. మా వ్యాపారం ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి మొదలైంది. 2020లో కోవిడ్ కారణంగా మా వ్యాపార కలలు కూడా కనుమరుగవుతాయనుకున్నాం. చాలా వ్యాపార సంస్థలు లాక్డౌన్ సమయంలో మూలనపడ్డాయి. మేం మా వ్యాపారాన్ని నలభై చికన్‌కారీ కుర్తీలు, పలాజోలు, చీరలతో మొదలు పెట్టాం. మా వెంచర్ పేరు ‘చౌకట్’. కోవిడ్ కాలంలో చాలామంది వద్ద డబ్బులేదు. కాబట్టి మా దుస్తులు అమ్ముడవుతాయన్న గ్యారెంటీ మాకు లేదు. అలాగని మా వ్యాపారాన్ని మూసేయడానికి మేం సిద్ధంగా లేం. మా నిర్ణయం సరైనదేనని ఆ తర్వాత అర్ధమైంది.పెరిగిన ఆర్డర్లు..అమ్మకానికి ఉంచిన డ్రెస్సులు హాట్‌కేక్‌లుగా అమ్ముడయ్యాయి. మొదటి నెలలోనే 34 ఆర్డర్లు వచ్చాయి. దాంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. మరిన్ని ఆర్డర్లు వచ్చిన తర్వాత ఒక లాజిస్టిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చికన్‌కారీ కుర్తీలు ఖరీదైనవి అనే అభి్రపాయాన్ని వారితో మాట్లాడి, మార్చగలిగాం.నాణ్యత విషయంలో రాజీపడకుండా తక్కువ ధరకే చికన్‌కారీ కుర్తీలు అందించ వచ్చని నిరూపించాం. ఈ నమ్మకం వల్లనే లాక్డౌన్ ప్రకటించిన ఇరవై రోజుల తర్వాత నుంచి కూడా మా ‘చౌకట్’ నుంచి దుస్తులు అమ్ముడు పోవడం పెరిగింది. కోవిడ్ కారణంగా డిజైనర్ల దగ్గరకు వెళ్లి, సరైనవి ఎంచుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మేమిద్దరం సొంతంగా డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కూడా మరో మైలురాయిలా నిలిచింది.‘చౌకట్’ టీమ్అభిరుచులు వేరైనా సృజన ఒక్కటే..ఇప్పుడు మా సంస్థలో 45 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో 5 వేల మంది నేత కార్మికులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. మా సంస్థకు విదేశాలలో కూడా క్లయింట్లు ఉన్నారు. డెబ్బైశాతానికి పైగా ఆర్డర్లు ఆన్లైన్లో డెలివరీ చేయబడతాయి. అక్కచెల్లెళ్లమే అయినా ఇలా కలిసి వ్యాపారం చేస్తామని కలలో కూడా అనుకోలేదు.మా ఇద్దరు చదువులు వేరు, అభిరుచులు వేరు. కానీ, మా ఇద్దరి ఆలోచన ఒక్కటిగా ఉన్నది ‘చౌకట్’ సృష్టించడంలో. నేను జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ప్రతాంక్షా గుప్తా ఫ్యాషన్/అప్పేరల్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మా అమ్మానాన్నలు మాకు పూర్తి సహకారం అదించడంతో నేడు మా కంపెనీ ఐదుకోట్ల టర్నోవర్‌కు చేరుకుంది’’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు.ఇవి చదవండి: Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా! -
Mukku Avinash: బేబీ బంప్‌తో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ భార్య (ఫొటోలు)
-
చంటి సినిమా నటి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా?
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ కలల ప్రపంచం. ఇందులో గుర్తింపు రావడమంటే ఆషామాషీ కాదు. కొందరికీ స్టార్డమ్ వచ్చినా అది ఎక్కువకాలం నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాములాంటిదే. అలా కొందరు నటీమణులు వెండితెరపై కనిపించి కనుమరుగవడం చూస్తుంటాం. వారు చేసింది కొంతకాలమే అయినా.. వారి నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుజా రెడ్డి . తెలుగమ్మాయి అయినప్పటికీ.. మలయాళం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మాతృభాషతో పాటు ఇతర భాషల్లో నటిగా, హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో) అనూజ రెడ్డి అంటే ఇప్పటి వారికి చాలామందికి పరిచయం లేకపోవచ్చు. ఆమెను ప్రస్తుతం సినీ ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ 1980లో హీరోయిన్గా, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. బ్రహ్మానందం-అనూజ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లకు చాలా క్రేజ్ ఉంది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదై నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనూజ రెడ్డి 2004 వరకు ఆమె సినిమాల్లో నటించారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఇప్పుడేం చేస్తోంది. ఎలా ఉందో తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో జన్మించిన అనూజ రెడ్డి 14 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు మూడేళ్ల వయసులోనే వారి కుటుంబం చెన్నైలోని కోడంబాక్కంలో సెటిలైంది. ఓ సినిమా కోసం తెలుగు అమ్మాయి కోసం అనూజ రెడ్డి ఉండే ఏరియాకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ మలయాళ సినిమాకు సెలెక్ట్ అయింది. చిన్న వయసులో తనకు సినిమాలు చేయటం ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారట. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి) అయినప్పటికీ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావటంతో తప్పలేదని తెలిపింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అనూజ కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్పట్లో సినిమాల్లో కామెడీతో అందరినీ నవ్వించిన అనూజ రెడ్డిని ఇప్పుడు చూస్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఢిల్లీ చీఫ్ సెలక్టర్ అమిత్ భండారిపై దాడి
న్యూఢిల్లీ: ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఆటగాళ్ల ఎంపికలో నిబంధనల ఉల్లంఘనలతో అప్రతిష్ఠ పాలైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మరో అవాంఛనీయ ఘటన. ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు ఏకంగా... భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అనూజ్ బృందం దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టారు. తల, చెవి భాగంలో గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు. పరిస్థితిని గ్రహించిన క్రికెటర్లు అడ్డుకునేందుకు ముందుకొచ్చారు. ఎవరూ కలుగజేసుకోవద్దంటూ నిందితులు తుపాకీ చూపించి బెదిరించారు. మరోవైపు అనూజ్ విషయంలో భండారి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవంబరులో 79 మందితో డీడీసీఏ విడుదల చేసిన అండర్– 23 ప్రాథమిక జాబితాలో అతడి పేరున్నా, ప్రదర్శన బాగోలేకపోవడంతో పక్కన పెట్టారు. అనూజ్ 1995 నవంబరు 22న జన్మించడంతో ఎంపికకు అర్హుడు కాలేకపోయాడు. 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. దాడిని మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండించారు. భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
సెమీస్ ఆశలు గల్లంతు!
► వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మిథాలీసేన ► 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు ► మహిళల టి20 ప్రపంచకప్ ధర్మశాల: సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి నాకౌట్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మంచి సమన్వయంతో ఆడిన ఇంగ్లండ్ మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 90 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు), మిథాలీ రాజ్ (33 బంతుల్లో 20; 2 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. హీథర్ నైట్ 3 వికెట్లు తీసింది. తర్వాత ఇంగ్లండ్ 19 ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులు చేసింది. బీమోంట్ (18 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. స్కివెర్ (19), టేలర్ (16) ఓ మోస్తరుగా ఆడారు. భారత బౌలర్లు ఆరంభంలో విజృంభించినా.. చివర్లో ఫీల్డింగ్‌లో కొంప ముంచారు. విజయానికి 3 పరుగులు చేయాల్సిన దశలో శుబ్స్రోల్ (5 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను మిథాలీ జారవిడిచింది. ఆ తర్వాతి బంతికి ఆమె ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ సొంతమైంది. బిస్త్ 4 వికెట్లు తీసింది. స్కోరు వివరాలు: భారత్ మహిళల ఇన్నింగ్స్: వనిత (సి) గ్రీన్వే (బి) నైట్ 0; మందన (బి) శ్రుబ్సోల్ 12; మిథాలీ (సి) గ్రీన్వే (బి) స్కివెర్ 20; శిఖా పాండే (సి) బ్రూంట్ (బి) నైట్ 12; హర్మన్‌ప్రీత్ రనౌట్ 26; వేద కృష్ణమూర్తి (బి) నైట్ 2; గోస్వామి (సి) టేలర్ (బి) శ్రుబ్సోల్ 2; అనుజా పాటిల్ రనౌట్ 13; బిస్త్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1-0; 2-15; 3-44; 4-47; 5-52; 6-65; 7-87; 8-90. బౌలింగ్: నైట్ 4-0-15-3; బ్రూంట్ 4-0-24-0; శ్రుబ్సోల్ 4-0-12-2; గున్ 4-0-16-0; గ్రుండె 2-0-14-0; స్కివెర్ 2-0-7-1. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: ఎడ్వర్డ్స్ (సి) వర్మ (బి) బిస్త్ 4; బిమోంట్ (సి) అనుజా (బి) కౌర్ 20; టేలర్ (స్టం) వర్మ (బి) కౌర్ 16; నైట్ (స్టం) వర్మ (బి) బిస్త్ 8; స్కివెర్ (సి) మిథాలీ (బి) బిస్త్ 19; గ్రీన్వే ఎల్బీడబ్ల్యు (బి) బిస్త్ 0; యాట్ రనౌట్ 5; బ్రూంట్ నాటౌట్ 4; గున్ రనౌట్ 7; శ్రుబ్సోల్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (19 ఓవర్లలో 8 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1-10; 2-42; 3-42; 4-62; 5-62; 6-71; 7-79; 8-87. బౌలింగ్: అనుజా 4-0-22-0; జులన్ 2-0-10-0; బిస్త్ 4-0-21-4; రాజేశ్వరి 4-1-10-0; హర్మన్‌ప్రీత్ 4-0-22-2; వేద 1-0-4-0.