Chanti Movie Artist Anuja Reddy Latest Look Goes Viral - Sakshi
Sakshi News home page

Anuja Reddy: అప్పట్లో కామెడీతో అలరించింది.. ఇప్పుడేంటీ ఇలా మారిపోయింది!

Published Sun, Jun 18 2023 1:14 PM | Last Updated on Sun, Jun 18 2023 2:13 PM

Chanti Movie Artist Anuja Reddy Latest Looks Goes Viral - Sakshi

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ కలల ప్రపంచం. ఇందులో గుర్తింపు రావడమంటే ఆషామాషీ కాదు. కొందరికీ స్టార్‌డమ్‌ వచ్చినా అది ఎక్కువకాలం నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాములాంటిదే. అలా కొందరు నటీమణులు వెండితెరపై కనిపించి కనుమరుగవడం చూస్తుంటాం. వారు చేసింది కొంతకాలమే అయినా.. వారి నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుజా రెడ్డి . తెలుగమ్మాయి అయినప్పటికీ.. మలయాళం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మాతృభాషతో పాటు ఇతర  భాషల్లో నటిగా, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో)

అనూజ రెడ్డి అంటే ఇప్పటి వారికి చాలామందికి పరిచయం లేకపోవచ్చు. ఆమెను ప్రస్తుతం సినీ ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ 1980లో హీరోయిన్‌గా, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా  దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. బ్రహ్మానందం-అనూజ కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ సీన్లకు చాలా క్రేజ్‌ ఉంది.  చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదై నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనూజ రెడ్డి 2004 వరకు ఆమె సినిమాల్లో నటించారు.  పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఇప్పుడేం చేస్తోంది. ఎలా ఉందో తెలుసుకుందాం. 

గుంటూరు జిల్లాలో జన్మించిన అనూజ రెడ్డి 14 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు మూడేళ్ల వయసులోనే వారి కుటుంబం చెన్నైలోని కోడంబాక్కంలో సెటిలైంది. ఓ సినిమా కోసం తెలుగు అమ్మాయి కోసం అనూజ రెడ్డి ఉండే ఏరియాకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ మలయాళ సినిమాకు సెలెక్ట్ అయింది. చిన్న వయసులో తనకు సినిమాలు చేయటం ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారట.

(ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి)

అయినప్పటికీ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావటంతో తప్పలేదని తెలిపింది.  సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అనూజ కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్పట్లో సినిమాల్లో కామెడీతో అందరినీ నవ్వించిన అనూజ రెడ్డిని ఇప్పుడు చూస్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement