![Comedian Brahmanandam 2nd Son Siddharth Engagement With Dr Aishwarya, Pics Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/22/Brahmanandam-2nd-Son-Siddharth-Engagement.jpg.webp?itok=5fLf79iK)
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్వర్యతో ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు.
ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. చదవండి: నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్
పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.గౌతమ్‌కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment