Mithali
-
అగ్రస్థానం ఎవరిదో!
ప్రొవిడెన్స్ (గయానా): ఎనిమిదేళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన భారత మహిళల జట్టు మరో ఆసక్తికర పోరుకు సన్నద్ధమైంది. గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ గ్రూప్ నుంచి ఇరు జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టును ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిస్తే భారత జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. అయితే తమ మూడు లీగ్ మ్యాచ్‌లలో కూడా అలవోక విజయాలు సాధించిన ఆసీస్ అమితోత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. సూపర్ ఫామ్‌లో మిథాలీ... టోర్నీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో కివీస్‌పై భారత్‌కు విజయం దక్కింది. ఆ తర్వాత పాక్‌పై, ఐర్లాండ్‌పై వరుసగా రెండు అర్ధ సెంచరీలతో మిథాలీ రాజ్ జట్టును గెలిపించింది. స్మృతి మంధాన గత మ్యాచ్‌లో రాణించడంతో ముగ్గురు సీనియర్ క్రికెటర్లు కూడా ఫామ్‌లో ఉన్నట్లయింది. వీరిలో కనీసం ఇద్దరు బాగా ఆడినా జట్టుకు మంచి విజయావకాశాలుంటాయి. జెమీమా రోడ్రిగ్స్ కూడా ఆకట్టుకోవడం జట్టుకు అదనపు బలం. మిడిలార్డర్లో వేద కృష్ణమూర్తికి తొలి రెండు మ్యాచ్‌లలో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. ఆమె కూడా చెలరేగితే భారత్ భారీ స్కోరును ఆశించవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కూడా భారత స్పిన్నర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీస్తోంది. కేవలం 12 స్ట్రయిక్ రేట్‌తో ఆమె 6 వికెట్లు తీసింది. ఐదేసి వికెట్లు తీసిన రాధా యాదవ్, హేమలత కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు మ్యాచ్‌లలో ఒక్కో పేసర్‌నే భారత్ ఆడించింది. తొలి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఆడగా, ఐర్లాండ్‌పై మాన్సి జోషి పొదుపైన బౌలింగ్ చేసింది. మళ్లీ సమష్టి ప్రదర్శన కనబరిస్తే కంగారూ జట్టును కూడా టీమిండియా కంగారు పెట్టించడం ఖాయం. జోరు మీదున్న హీలీ... మరోవైపు ఆస్ట్రేలియా కూడా అలవోక విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌పై 52 పరుగులతో ఘన విజయం సాధించిన ఆ జట్టు... ఆ తర్వాత ఐర్లాండ్‌ను 9 వికెట్లతో, న్యూజిలాండ్‌ను 33 పరుగులతో చిత్తు చేసింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ అలీసా హీలీ ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తోంది. 160.20 స్ట్రయిక్ రేట్‌తో ఆమె ఈ టోర్నీలో 157 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు సునాయాస అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ విజయాల్లో మూనీ, కెప్టెన్ లానింగ్‌లు హీలీకి సహకరించారు. జట్టును గెలిపించడంలో స్ట్రయిక్ పేస్ బౌలర్ మెగాన్ షుట్ది కూడా కీలక పాత్ర. మూడు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు తీసిన షుట్ ఓవర్లో ఐదు పరుగులకు మించి ఇవ్వలేదు. షుట్ కాకుండా ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరో ఐదుగురు బౌలర్లను ఉపయోగించగా వారంతా తలా మూడు వికెట్లతో సత్తా చాటడం విశేషం. కెరీర్లో 100వ టి20 మ్యాచ్ ఆడబోతున్న సీనియర్ పేసర్ ఎలైస్ పెర్రీ కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టగలదు. ఇరు జట్లు దూకుడుగా ఆడుతుండటంతో ఈ చివరి లీగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోహిత్ శర్మను దాటిన మిథాలీ... అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. పురుషులు, మహిళల టి20లను కలిపి చూస్తే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనతకెక్కింది. రోహిత్ శర్మ (87 మ్యాచ్‌లలో 2207 పరుగులు)ను అధిగమించి మిథాలీ (85 మ్యాచ్‌లలో 2283) అగ్రస్థానానికి చేరుకుంది. రోహిత్ సగటు 33.43 కాగా, మిథాలీ 37.42 సగటుతో కొనసాగుతోంది. 4 సెంచరీలతో పాటు రోహిత్ మరో 15 అర్ధ సెంచరీలు చేయగా... 97 అత్యధిక స్కోరు కలిగిన మిథాలీ కెరీర్లో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లి (2102), హర్మన్‌ప్రీత్ కౌర్ (1,827) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. రాత్రి గం.8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
-
బ్యాటింగ్ మొదలవకుండానే 10 పరుగులు
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బంతితో కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో చితక్కొట్టి... గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. ప్రొవిడెన్స్ (గయానా): సొంతగడ్డపై పురుషుల జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంటే... విండీస్ గడ్డపై భారత అమ్మాయిలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పని పట్టారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే... రెండో మ్యాచ్‌లో వెటరన్ మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఆ బాధ్యత తీసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మిథాలీ రాజ్, స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఆ ఇద్దరే... గత మ్యాచ్ మాదిరిగానే భారత్ ఒకే ఒక్క పేస్ బౌలర్‌తో బరిలో దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (1/24) అయేషా జఫర్ (0) వికెట్ పడగొట్టింది. అనంతరం భారత్ చురుకైన ఫీల్డింగ్‌కు ఉమైమా (3), కెప్టెన్ జవేరియా ఖాన్ (17) రనౌట్‌గా వెనుదిరిగారు. దీంతో పాక్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బిస్మా, నిదా సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. నిదా 15 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వేద కృష్ణమూర్తి, 29 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను పూనమ్ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె భారీ షాట్లతో చెలరేగింది. 28 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బిస్మా 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాక హేమలత వేసిన 19వ ఓవర్ తొలి బంతికి బిస్మా మారూఫ్ పెవిలియన్ చేరింది. మరుసటి బంతికే నిదా దార్ సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నా ఆ వెంటనే ఆమె కూడా వెనుదిరిగింది. చివరి ఓవర్లో పూనమ్ యాదవ్ మరో రెండు వికెట్లు పడగొట్టింది. మిథాలీ మెరుపులు... ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే భారత్ ఖాతాలో 10 పరుగులు చేరడంతో ఓపెనర్లు మిథాలీ, స్మృతి ధాటిగా ఆడారు. రెండో ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు... నాలుగో ఓవర్లో మిథాలీ రెండు బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 48/0తో నిలిచింది. ఎనిమిదో ఓవర్లో మిథాలీ మరో రెండు ఫోర్లు బాది దూకుడు పెంచింది. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాక స్మృతి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయింది. ఆ తర్వాత ఆచితూచి ఆడిన మిథాలీ... జెమీమా రోడ్రిగ్స్ (16; 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 42 బంతుల్లో మిథాలీ అర్ధశతకం పూర్తి చేసుకుంది. విజయానికి 14 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో మిథాలీ వెనుదిరిగినా... వేద (8)తో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) మిగతా పని పూర్తిచేసింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అయేషా (సి) వేద (బి) అరుంధతి రెడ్డి 0; జవేరియా (రనౌట్) 17; ఉమైమా (రనౌట్) 3; బిస్మా (సి) వేద (బి) హేమలత 53; నిదా దార్ (సి) హర్మన్ (బి) హేమలత 52; ఆలియా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 4; నహిద ఖాన్ (నాటౌట్) 0; సనా (స్టంప్డ్) తాన్యా (బి) పూనమ్ 0; సిద్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–30, 4–123, 5–129, 6–133, 7–133. బౌలింగ్: అరుంధతి రెడ్డి 4–1–24–1, రాధ యాదవ్ 4–0–26–0, దీప్తి శర్మ 4–0–26–0, హేమలత4–0–34–2, పూనమ్ యాదవ్ 4–0–22–2. భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ (సి) నిదా (బి) డయాన బేగ్ 56; స్మృతి (సి) ఉమైమా (బి) బిస్మా 26; జెమీమా (సి అండ్ బి) నిదా 16; హర్మన్ (నాటౌట్) 14; వేద (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–73, 2–101, 3–126. బౌలింగ్: డయానా బేగ్ 3–0–19–1, ఆనమ్ 3–0–27–0, సనా మిర్ 4–0–22–0, నిదా 4–0–17–1, ఆలియా 2–0–21–0, బిస్మా మారూఫ్ 3–0–21–1. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కల చెదిరె...
ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ 9 పరుగులతో ఇంగ్లండ్ గెలుపు ►నాలుగో సారి విశ్వ విజేత ►పూనమ్ రౌత్ పోరాటం వృథా ►ష్రబ్‌సోల్‌కు 6 వికెట్లు ఎన్నో ఆశలు, ఎన్నో కలలు... అనుభవరాహిత్యం, ఒత్తిడి ముందు చెదిరిపోయాయి. అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో చేరువగా వచ్చినా, చివరకు ఆ విజయం అందకుండా దూరంగా వెళ్లిపోయింది. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని తమ వైపునకు తిప్పుకున్న భారత మహిళల సైన్యం చివరకు గుండె పగిలే రీతిలో ఓటమిని ఆహ్వానించింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం చేజారిన అవకాశాన్ని ఈ సారి ఒడిసిపట్టుకునేలా కనిపించినా... ‘విమెన్ ఇన్ బ్లూ’ కడకు దానిని చేజార్చుకున్నారు. సొంత మైదానంలో ఒక దశలో అనూహ్య పరాజయం పలకరిస్తున్నా... పట్టుదల వదలకుండా పోరాడిన ఇంగ్లండ్ నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని తలకెత్తుకుంది. 229 పరుగులను ఛేదించే క్రమంలో ఒక దశలో స్కోరు 191/3. కెప్టెన్ మిథాలీ, హిట్టర్ హర్మన్‌ప్రీత్ వెనుదిరిగినా... ఫామ్‌లో ఉన్న పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి అలవోకగా జట్టును గెలిపించేలా కనిపించారు. ప్రతీ భారత అభిమానికి ఇక విజయం ఖాయమే అనిపించింది. కానీ ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ ఒక్కసారిగా చెలరేగింది. ఉత్కంఠ స్థితిలో మన మహిళల పొరపాట్లు కూడా కలిసి భారత్ తలరాతను మార్చేశాయి. చివరకు 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఏమీ చేయలేక టీమిండియా చేతులెత్తేసింది. భారత్ దూకుడు ముందు ఓటమికి చేరువైనట్లు కనిపించినా హీథెర్ నైట్ కెప్టెన్సీ ఆతిథ్య జట్టును విజేతగా నిలిపింది. ప్రపంచ కప్ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్ రాత మారిపోతుంది... మన కెప్టెన్ పదే పదే టోర్నీలో చెప్పిన మాట ఇది. ఫర్వాలేదు... ఫైనల్లో ఓడినా మీ ఆటకు జోహార్లు. ఈ టోర్నీలో ప్రదర్శన చాలు మీ ఆట ఎన్నో మెట్లు పైకి ఎక్కిందని చెప్పేందుకు! మీ మ్యాచ్‌ల గురించి ఇక ముందు ప్రపంచం చర్చిస్తుంది. జయాపజయాల గురించి మాట్లాడుతుంది. లార్డ్స్ మైదానంలో హౌస్‌ఫుల్‌గా వరల్డ్ కప్ మహిళల మ్యాచ్ జరిగిందంటే అది మీ ఆటపై నమ్మకంతోనే. లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి ఆడవారి ఆట కోసం ఎదురు చూశారంటే అది మీ ఆటలోని గొప్పతనమే. ఫైనల్ ఓటమి తీవ్రంగా కలచివేసిందనడంలో సందేహం లేదు. కానీ వారి ఘనతను ఈ ఓటమి ఏమాత్రం తగ్గించలేదనేది సత్యం. లండన్: తొలిసారి వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. తుది పోరులో చక్కటి విజయావకాశాలు లభించినా... అనూహ్యంగా తడబడి చివరకు జట్టు ఓటమి పాలైంది. ఆదివారం ఇక్కడి లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నటాలీ సివర్ (68 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జులన్ గోస్వామి 3 కీలక వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. పూనమ్ రౌత్ (115 బంతుల్లో 86; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్య ష్రబ్సోల్ (6/46) భారత్ పతనాన్ని శాసించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది. జులన్ జోరు... పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ సాధారణ స్కోరుకు పరిమితమైందంటే అది జులన్ గోస్వామి చలవే. తన రెండో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న ఈ సీనియర్ పేసర్ కీలక సమయంలో కదం తొక్కింది. ఆమె వేసిన రెండు స్పెల్‌లు ప్రత్యర్థిని దెబ్బ తీశాయి. తొలి స్పెల్‌లో 5 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చిన జులన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేసింది. ఓపెనర్లు విన్ఫీల్డ్ (35 బంతుల్లో 24; 4 ఫోర్లు), బీమాంట్ (37 బంతుల్లో 23; 5 ఫోర్లు) శిఖా పాండే బౌలింగ్‌లో పరుగులు చేయగలిగినా, జులన్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి తొలి ఓవర్లో విన్ఫీల్డ్ మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఎట్టకేలకు విన్‌ఫీల్డ్‌ను రాజేశ్వరి బౌల్డ్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించింది. అనంతరం లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ తొలి ఓవర్లోనే బీమాంట్ను పెవిలియన్ పంపించింది. ఆ వెంటనే కీలకమైన కెప్టెన్ నైట్ (1)ను కూడా ఎల్బీడబ్లు్యగా అవుట్ చేసి ఆమె ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత్ ఎల్బీ అప్పీల్‌ను ముందు అంపైర్ తిరస్కరించినా... మిథాలీ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. అనంతరం సారా టేలర్ (62 బంతుల్లో 45), సివర్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. 32 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 144/3. ఈ దశలో జులన్ తన రెండో స్పెల్‌ను మొదలు పెట్టింది. తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో టేలర్, విల్సన్ (0)లను అవుట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సివర్ను కూడా ఆమె ఎల్బీగా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. జులన్ తన రెండో స్పెల్‌లో 5 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. కీలక భాగస్వామ్యం... ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. స్మృతి మంధన (0) మళ్లీ విఫలమైంది. రౌత్, మిథాలీ (31 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నంలో నెమ్మదిగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కొద్ది సేపటికే మిథాలీ రనౌట్ భారత్‌ను ఇబ్బందుల్లో పడేసింది. రౌత్ మిడ్ వికెట్ దిశగా బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా... చురుగ్గా స్పందించలేకపోయిన కెప్టెన్ మిథాలీ మరో ఎండ్‌కు చేరే సరికి కీపర్ టేలర్ బెయిల్స్‌ను పడగొట్టింది. ఈ స్థితిలో పూనమ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే భారీషాట్ ప్రయత్నంలో కౌర్ అవుట్ కావడంతో 95 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. వేద, రౌత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు భారత్‌కు మంచి విజయావకాశాలు కనిపించాయి. అయితే ఆ తర్వాత పది పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో జట్టు ఓటమికి చేరువైంది.బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న దీప్తి శర్మ (14) కూడా అదే బాట పట్టగా, రాజేశ్వరిని బౌల్డ్ చేసి ష్రబ్సోల్ ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా నిలిపింది. నాకు గర్వంగా ఉంది. ఓడినా... మేం ఇంగ్లండ్‌ను వణికించాం. అయితే కడదాకా పోరాడి గెలిచారు వాళ్లు. మేం బాగానే ఆడినా... గెలిచే దారిలో ఓడాం. మా అమ్మాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉన్నా. ఏ మ్యాచ్‌నూ మా వాళ్లు తేలిగ్గా తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ కష్టపడ్డారు. ఎక్కువమందికి ఇదే తొలి ఫైనల్. ఈ అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞురాలైన జులన్ గోస్వామి చక్కగా బౌలింగ్ చేసింది. గెలిచి ఉంటే ఆమె కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అయ్యేది. ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన వారికి థ్యాంక్స్. ఇది మహిళల క్రికెట్‌కు నూతన ఉత్తేజాన్నిస్తోంది. నేను మరో రెండు, మూడేళ్లు ఆడతాను. అయితే 2021లో జరిగే తదుపరి ప్రపంచకప్దాకా మాత్రం ఆటలో ఉండను. – భారత కెప్టెన్ మిథాలీ మా సంతోషానికి అవధుల్లేవ్. జట్టు సహచరులంతా అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మ్యాచ్‌ను చేజేతులా ఇక్కడిదాకా తెచ్చుకున్నాం. అయినా ఈ టోర్నీలో ఉత్కంఠ రేపే మ్యాచ్‌ల్లో గెలిచాం. గత 18 నెలలుగా మేం ఇలాంటి ఒత్తిడి మ్యాచ్‌ల్ని ఎన్నో ఎదుర్కొన్నాం. ష్రబ్సోల్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మ్యాచ్‌ను మా చేతుల్లోకి తెచ్చింది. భారత జట్టులో పూనమ్ రౌత్ బాగా ఆడింది. వారి భాగస్వామ్యాలు కూడా మమ్మల్ని కలవరపెట్టాయి. – ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు 6 లక్షల 60 వేల డాలర్లు (రూ. 4 కోట్ల 25 లక్షలు)... రన్నరప్ భారత జట్టుకు 3 లక్షల 30 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు లక్షా 65 వేల డాలర్ల చొప్పున (రూ. కోటి) దక్కాయి. 2021 ప్రపంచకప్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది. -
పేర్లు చెప్పండి చూద్దాం!
అబ్బో... మగాళ్లు మహిళలకిచ్చిన గౌరవం తక్కువేం కాదు. అదేదో అన్నారు. ఏమన్నారూ... ఆకాశంలో సగం! మరి భూమ్మీద? ముప్పైమూడు పర్సెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? మహిళలు వరల్డ్ కప్ ఫైనల్‌కి వచ్చేశారంటే.. గెలవడానికి ఫిఫ్టీ–ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నట్లే. అంటే.. భూమ్మీద కూడా సగం ఛాన్స్. మరి ఇంత కాన్ఫిడెంట్‌గా, బలంగా బ్యాట్‌తో బాల్ని కొట్టి మరీ చెప్తున్నాం కదా.. ఏదీ.. ఇంటర్నెట్ చూడకుండా.. మన మహిళా టీమ్‌లోని ప్లేయర్ల పేర్లు చెప్పుకోండి. అందరి పేర్లూ అక్కర్లేదు.. ఆకాశంలో సగంలా.. కనీసం సగం చెప్పండి చూద్దాం?! ఇట్స్ ఓకే! ఉమెన్ టీమ్‌లో ఎవరి పేర్లు ఏమిటో మీకు తెలికపోవడాన్ని అలా ఉంచండి. సాక్షాత్తూ విరాట్ కొహ్లికే తెలియదంటే ఏమనుకోవాలి?! ఉమెన్ క్రికెట్‌ని ఆయన క్రికెట్‌గా గుర్తించడం లేదనా? మగాళ్లు ఆడితేనే అది క్రికెట్ అని కోహ్లి కూడా అనుకుంటున్నాడనా?! ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ మిథాలీరాజ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. కోహ్లి నిజంగా వీళ్ల ఆటను చూశాడో లేక ఎవరైనా అంటుంటే విన్నాడో ‘వావ్ మిథాలీ’ అని ట్విట్టర్లో కాంప్లిమెంట్ ఇచ్చాడు. ‘ఎ గ్రేట్ మూమెంట్’ అంటూ మొదలైన ఆ ప్రశంస.. ‘చాంపియన్ స్టఫ్’ అంటూ నాలుగు చిన్నచిన్న లైన్లలో ముగిసింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆ కాంప్లిమెంట్‌కి ఆయన పెట్టిన ఫొటోలో ఉన్నది నిజానికి మిథాలీ కాదు... పూనమ్ రౌత్! కోహ్లి ఒక్కడే కాదు! అప్పటికి (మిథాలీ రికార్డు సాధించే రోజుకు) ఉమన్ వరల్డ్ కప్ మొదలై ఇరవై రోజులు అవుతున్నా.. వరల్డ్ కప్‌లో మహిళల ఆటకు చిన్న ట్వీట్ ముక్క ఇచ్చిన క్రికెట్ సెలబ్రిటీలే లేరు! కోహ్లి పెట్టిన ఆ ఒక్క ట్వీట్‌కైనా రీట్వీట్స్ ‘సున్నా’. టెండూల్కర్ పాపం ఉదారంగా 5 ట్వీట్లు ఇచ్చాడు. దానికి వచ్చిన రీ ట్వీట్లు కూడా ‘సున్నా’నే! హర్భజన్ 3, లక్ష్మణ్ 5 ట్వీట్లు ఇస్తే హర్భజన్‌కి మాత్రం ఒక్క రీ ట్వీట్ వచ్చింది. ఇక రవీంద్ర జడేజా, రవిశాస్త్రి ఒక్క ట్వీట్ కూడా ఇవ్వలేదు. టీవీ ప్రెజెంటర్లు మందిరా బేడి, మయంతి, అర్చన ఒక్కో ట్వీట్ చొప్పున ఇస్తే మాయంతికి మాత్రం ఓ రీట్వీట్ వచ్చింది. శివానీ జీరో ట్వీట్. ఇక్కడో పాయింట్ గమనించాలి. మహిళా క్రీడా ప్రముఖులు కూడా మహిళల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. జూలై 2న ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ‘వావ్.. వాటే షాట్..’ అని పెద్దగా షౌట్ చేసిన అర్చన, బేడీ.. ఉమెన్ క్రికెట్‌కు ఒకటంటే ఒకటే షౌట్ ఇచ్చారు. మిథాలీ రాజ్ 6 వేల పరుగుల మైలు రాయిని దాటినప్పుడు మయంతి మాత్రం చిన్న ట్వీట్ మేసేజ్ ఒకటి వదిలారు. ఆ క్షణానికే అప్రిసియేషన్ రేపటితో ముగుస్తున్న ఉమన్ వరల్డ్ కప్‌కు ఇంతవరకు ఒక్క సెహ్వాగే ఎక్కువ ట్వీట్లు ఇచ్చారు. అయితే అది ఆయన సహజ స్వభావం. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ.. వాళ్లు మగవాళ్లు కానివ్వండి, మహిళలు కానివ్వండి.. బాగా ఆడితే సెహ్వాగ్ ఇన్స్పైరింగ్ ట్వీట్లు ఇస్తుంటారు. జూన్ 24న ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి టీమ్‌లో ప్రతిభ కనబరిచిన ప్రతి అమ్మాయినీ సెహ్వాగ్ మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూనే ఉన్నాడు. అయితే ఇలాంటివన్నీ ఆ క్షణానికే అప్రిసియేషన్లు తప్ప మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు, కృషికి, సామర్థ్యానికి తగిన గుర్తింపు కానే కాదు. గుర్తింపు అంటే ప్రతిఫలం, ప్రాధాన్యం, ప్రోత్సాహం. ఇవి మూడూ మన మహిళా క్రికెటర్లకు లేవన్నది నిజం. వీళ్లకూ వాళ్లేనా హీరోలు?! కోహ్లి తన పొర పాటును తెలుసుకుని (అది కూడా ఎవరో తెలియజెబితే) వెంటనే ట్విట్టర్‌లోంచి పూనమ్ రౌత్ ఫొటోను తొలగించినప్పటికీ.. మహిళల ఆటలపై మన సమాజంలో ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ ఉన్నాయో ఆయన పోస్ట్ వల్ల మరోసారి స్పష్టం అయింది. 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న మిథాలీ రాజ్‌ని కోహ్లి ఎలా గుర్తించలేకపోతాడు? 2006లో తమిళనాడుతో కోహ్లి తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడేనాటికే మిథాలీ స్టార్ క్రికెటర్. ఆ సంగతి మర్చిపోయాడనే అనుకుందాం. ఈ మధ్యే కదా కోహ్లి.. మిథాలీతో కలిసి పద్మశ్రీకి నామినేట్ అయింది! ఇదీ గుర్తు లేదనుకుందాం. తామిద్దరూ నామినేట్ అయినప్పుడు మిథాలీకి ఆ అవార్డు రావడమైనా కోహ్లి ఎలా మరచిపోగలడు? కోహ్లిని తప్పు పట్టడం కాదు. అసలు క్రికెట్‌కు ఉన్నంత ప్రాధ్యాన్యం మన దగ్గర మిగతా ఆటలకు ఉండదు. అదీ మగవాళ్ల క్రికెట్‌పైనే. మగవాళ్లు డకౌట్ అయి, మహిళలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నా వాళ్లకేం గుర్తింపు ఉండదు. అంతెందుకు? ఈ వరల్డ్ కప్‌లో మిథాలీని ‘మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరు?’ అని అడిగేశారు ఎవరో. మిథాలీ కడిగేశారు ఆ అడిగినవాళ్లని. ‘ఇదే మాటను వాళ్లన అడగ్గలరా?’ అని. నిజమే కదా! విరాట్ కోహ్లిగానీ, ఇంకో మగ క్రికెటర్‌గానీ చెప్పగలరా.. తమ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరో! అక్కడి వరకూ వద్దు బాస్. మన ఉమెన్ టీమ్‌లో ఉన్న వాళ్లలో ఓ ఐదుగురు పేర్లు చెప్పమనండి చాలు. కోహ్లి ది గ్రేట్ అవుతాడు. చులకన.. చిన్న చూపు క్రికెట్లో ఉన్నంత సెక్సిజం మిగతా ఆటల్లో లేదు. సెక్సిజం అంటే.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ అనే భావం. ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను చులకన చేయడం. దీనికి కారణం.. క్రికెట్ మగాళ్ల ఆట అనుకోవడం! ఈ సెక్సిజం నుంచే.. ‘మీ మేల్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?’ అనే అర్థం లేని ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. దీనిని మిథాలీ బాగానే తిప్పకొట్టారు. మగాళ్లు మళ్లీ నోరెత్తలేదు. మిథాలీ అలా అనగానే నటి అదాశర్మ వెంటనే బయటికి వచ్చారు. క్రికెట్లోనే కాదు, అన్ని చోట్లా ఈ వివక్ష ఉంది. దీన్ని మనమొక ఛాలెంజ్‌గా తీసుకుని ఫైట్ చెయ్యాలి అంటూ మిథాలీకి సపోర్ట్ చేశారు. గుత్తా జ్వాల అయితే బ్యాట్ పట్టుకుని వచ్చేశారు. ‘మనం ఏదైనా సాధిస్తే చాలు.. యారోగెంట్ అనేస్తారు? ఏమీటీ సెక్సిజం’ అని ఫోర్స్‌గా ఓ షాట్ కొట్టారు. ఆ వెంటనే వీవీఎస్ లక్ష్మణ్ పిచ్‌లోకి వచ్చేశాడు. నో.. డౌట్ బాస్.. మిథాలీ, జులన్, సానియా, సైనా, సిం«ధు.. ఇవాళ్టి హీరోలు. మనం ఒప్పుకోవాలి’ అని మిథాలీ ఆగ్రహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. అందరికీ అంత బ్రాడ్ మైండ్ ఉంటుందా? పురుషాహంకారం మహిళ ప్రతిభకు ప్రణమిల్లుతుందా? లేదు. మహిళా క్రికెటర్లపై అన్నిట్లో చిన్నచూపే. ప్రోత్సాహం ఉండదు. ప్రతిఫలం ఉండదు. ప్రచారం ఉండదు. డబ్బు పెట్టేవాళ్లుండరు. ప్రైజ్ మనీ కూడా భారీగా ఉండదు. ఇవన్నీ అలా ఉంచండి. ఒక షాట్ కొడితే, ఒక క్యాచ్ పడితే.. స్టేడియంలో కానీ, ఇంట్లో టీవీ ముందు కానీ ఒక కదలిక ఉండదు. ఇన్ని అనా సక్తులను, అననుకూలతలను, అవరోధాలను విజయ వంతంగా దాటుకుని రేపు ఆదివారం మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడబోతోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా.. అది ఉమెన్ ప్లేయర్లు లైంగిక వివక్షపై సాధించిన గెలుపే అవుతుంది. భలే ‘ఇచ్చింది’ మంధన ప్రస్తుతం ఆడుతున్న ఇండియన్ టీమ్‌లో స్మృతీ మంధన అనే అమ్మాయి ఉంది. జస్ట్ ఇరవై ఏళ్ల అమ్మాయి. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇంత చిన్న వయసులో ఎవరూ సెంచరీ కొట్టలేదు. స్మృతి కొట్టింది. తొమ్మిదేళ్ల వయసుకే ఈ మహారాష్ట్ర అమ్మాయి అండర్ 15లో ఆడింది. అండర్–19లో మహారాష్ట్ర టీమ్‌లో ఆడింది. పదహారేళ్ల వయసులో వెస్ట్ జోన్ తరఫున వన్డే గేమ్‌లో డబుల్ సెంచరీ చేసింది. ఇవన్నీ కాదు కానీ... ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇచ్చింది చూడండీ.. ఓ ఆన్సర్.. అదో పెద్ద సిక్సర్. ‘మీరు ప్రపంచకప్ గెలుస్తామని అనుకుంటున్నారా?’ అని బీబీసీ జర్నలిస్టు.. టోర్నీకి ముందు స్మృతిని అడిగాడు. ‘ఏం.. మీరు అనుకోవడం లేదా?’ అని స్మృతి ఏ మాత్రం తడుముకోకుండా అనేసింది. ఈ సమాధానానికి ఎక్కడో ఉన్న ధోని ఇంప్రెస్ అయి, నెట్లో ‘ఐ యామ్ ఇంప్రెస్డ్’ అని కామెంట్ పెట్టాడు. ఉమెన్ టీమ్లలోని (అది ఏ టీమ్ అయినా) విజయస్ఫూర్తికి.. స్మృతి ఒక నిదర్శనం. వాళ్లకు కోట్లలో... వీళ్లకు లక్షల్లో..! భారత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళల క్రికెటర్లకు లభించే మొత్తం నామమాత్రమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత ఫిబ్రవరిలో పురుషుల క్రికెటర్లకు ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ వివరాల ప్రకారం... గ్రేడ్ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 2 కోట్లు, గ్రేడ్ ’బి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. కోటి, గ్రేడ్ ’సి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు చెల్లిస్తారు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే ఆడితే రూ. 7 లక్షలు, టి20 మ్యాచ్ ఆడితే రూ. 3 లక్షలు ఇస్తారు. దేశవాళీ రంజీ ట్రోఫీలో మ్యాచ్‌కు రూ. 40 వేలు చొప్పున అందజేస్తారు. ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెటర్లకు 2016–2017 సీజన్ వార్షిక కాంట్రాక్ట్ వివరాలను ఇంకా ప్రకటించనే లేదు. 2015–2016 సీజన్ ప్రకారమైతే గ్రేడ్ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి మరీ అధ్వాన్నంగా రూ. 15 లక్షలు, గ్రేడ్ ’బి’లో ఉన్న వారికి రూ. 10 లక్షలు అందించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ 2017 ఇండియా–టీమ్ నిలబడి ఉన్నవారు (ఎడమ నుంచి) : శిఖా పాండే, జులన్ గోస్వామి, మాన్సీ జోషి, మోనా మేష్రమ్, వేద కృష్ణమూర్తి, మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతీ మంధన, హర్మన్ ప్రీత్‌కౌర్, సుష్మా వర్మ (వికెట్ కీపర్) కూర్చున్నవారు (ఎడమ నుంచి): పూనమ్ యాదవ్, పూనమ్ రౌత్, నుజ్హత్ పర్వీన్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, ఏక్తా బిస్త్ -
సెమీస్‌కా? ఇంటికా?
►న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైన భారత్ ►కలవరపెడుతున్న బ్యాటింగ్, ఫీల్డింగ్ ►ఒత్తిడిలో మిథాలీ రాజ్ బృందం అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయ విజయాలతో మిథాలీ సేన అందరికంటే ముందే సెమీస్ చేరుతుందనుకుంటే... గత రెండు మ్యాచ్‌ల పరాభవం భారత మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో నాకౌట్ చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్ ఆర్డర్ తిరిగి గాడిన పడితేనే కివీస్‌ను పడేయొచ్చు. లేదంటే టీమిండియాకు మరోసారి లీగ్ దశతోనే ప్రపంచ కప్ ముచ్చట ముగుస్తుంది. ఒకవేళ వరుణుడు కరుణించి మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. డెర్బీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఇంకా లీగ్ దశ ముగియలేదు. కానీ భారత్ మాత్రం నాకౌట్‌కు ముందే నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. మెగా ఈవెంట్లో శనివారం క్వార్టర్స్‌ను తలపించే లీగ్ పోరులో మిథాలీ సేన... న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరా యి. దీంతో మిగిలున్న ఒక బెర్త్ కోసం భారత్, కివీస్‌లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో 8, న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లున్నాయి. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ 9 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. నిలకడలేమి... ప్రారంభంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో గెలుస్తూ వచ్చిన భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో నిలకడలేని బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్ స్మృతి మంధన మొదటి రెండు మ్యాచ్‌ల్లో వీరవిహారం చేసింది. కానీ ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఈమెతో పాటు కీలక సమయాల్లో ఎవరో ఒకరిద్దరు మినహా సమష్టిగా రాణించకపోవడంతో భారత్ స్కోరు వేగం మందగిస్తోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఒక్క మిథాలీ రాజే నిలకడను కనబరిచింది. పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ వీరంతా తలా ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కానీ తప్పక గెలవాల్సిన పోరులో వీరంతా కలిసి సర్వశక్తులు ఒడ్డాలి. భారత అమ్మాయిలు ఫీల్డింగ్ లోపాల్ని కూడా సవరించుకోవాలి. తొలి మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా ఎనిమిది క్యాచ్‌ల్ని నేలపాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థిని కట్టడి చేయాలి. లేదంటే లీగ్ దశతోనే ఇంటికొచ్చే ప్రమాదముంది. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే సుజీ బేట్స్ సారథ్యంలోని ఈ జట్టు మేటి ఆల్‌రౌండ్ టీమ్. శాటర్‌వైట్, రాచెల్ ప్రిస్ట్ ఈ టోర్నీలో ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు బౌలింగ్‌లోనూ టీనేజ్ స్పిన్నర్ అమిలియా కెర్, లె కాస్పెరెక్ల రూపంలో నాణ్యమైన బౌలర్లున్నారు. జట్లు (అంచనా) భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధన, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, సుష్మ వర్మ, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, ఏక్తా బిష్త్, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్. న్యూజిలాండ్: సుజీ బేట్స్ (కెప్టెన్), శాటర్‌వైట్, రాచెల్ ప్రిస్ట్, సోఫీ డివైన్, మ్యాడీ గ్రీన్, హడిల్‌స్టోన్, లె కాస్పెరెక్, అమిలియా కెర్, కేటీ మార్టిన్, కెటీ పెర్కిన్స్, లి తహుహు. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌తో భారత్ 11 సార్లు తలపడింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోయి, కేవలం ఒక మ్యాచ్‌లోనే భారత్ గెలిచింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 44 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 16 మ్యాచ్‌ల్లో... న్యూజిలాండ్ 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. -
'ఏక్తా'తా చేతిలో పాక్ ఖతం
►5 వికెట్లు తీసిన ఏక్తా బిష్త్ ►95 పరుగులతో భారత్ ఘన విజయం ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా దాయాది పాక్‌ను దంచేసింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత విజయంలో బ్యాట్స్‌మెన్ ఘనత వహిస్తే... ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా బౌలర్లే గెలిపించారు. స్వల్ప స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ (10–2–18–5) అద్భుతమైన స్పెల్‌తో రెచ్చిపోయింది. ఎవరినీ క్రీజులో నిలువనీయకుండా దెబ్బ మీద దెబ్బ తీసింది. పాక్‌ను చిత్తుగా ఓడించిన మిథాలీ సేన... రెండు వారాల క్రితం ఇదే ఇంగ్లండ్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవాన్ని మరిపించే ప్రయత్నం చేసింది. డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎదురేలేకుండా దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి మరీ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 95 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 4 వికెట్లు తీసింది. తర్వాత పాకిస్తాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సనా మీర్ (29)దే టాప్ స్కోర్. అద్భుత బౌలింగ్‌తో ఏక్తా బిష్త్ (5/18) పాక్ పతనాన్ని శాసించింది. రాణించిన పూనమ్ రౌత్ టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పూనమ్ రౌత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్మృతి మంధన (2) విఫలమైంది. తర్వాత దీప్తి శర్మ, పూనమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో పరుగుల వేగం మందగించింది. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాక జట్టు స్కోరు 74 పరుగుల వద్ద పూనమ్ రౌత్ ఔటయ్యింది. నష్ర సంధుకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. మిథాలీ రాజ్ (8), దీప్తి శర్మ (63 బంతుల్లో 28; 2 ఫోర్లు)లను నష్ర సంధు ఔట్ చేయగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (10), మోనా మేశ్రమ్ (6)లిద్దరు సాదియా యూసుఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 111 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కీపర్ సుష్మ వర్మ, జులన్ గోస్వామితో కలిసి (36 బంతుల్లో 14) కాసేపు పోరాడింది. 74 పరుగులకే ఖేల్ ఖతం: జోరు మీదున్న భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న పాకిస్తాన్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఒక పరుగు మీద ప్రారంభమైన పాక్ పతనం ఇక ఎక్కడా ఆగలేదు. రెండో ఓవర్ నుంచే స్పిన్నర్ ఏక్తా బిష్త్ తన మాయాజాలాన్ని చూపించింది. మొదట అయేషా జాఫర్ (1)ను ఔట్ చేసిన ఆమె... సిద్రా నవాజ్ (0), ఇరమ్ జావెద్ (0)లను పెవిలియన్ పంపింది. ఈ మూడు వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే వచ్చాయి. జవేరియా (6) జులన్ గోస్వామి బౌలింగ్‌లో నిష్క్రమించింది. దీంతో చూస్తుండగానే పాక్ స్కోరు 26/6కు చేరింది. ఓపెనర్ నాహిదా ఖాన్ (23), కెప్టెన్ సనా మీర్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►10- 0 వన్డేల్లో పాకిస్తాన్‌తో తలపడిన పది సార్లు భారత్‌దే విజయం -
భారత మహిళలదే సిరీస్
రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపు విజయవాడ స్పోర్ట్స: భారత్‌పై గెలిచి ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన వెస్టిండీస్ మహిళలకు మిథాలీ సేన చేతిలో వరుస పరాజయాలు ఎదురవుతున్నారుు. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కై వసం చేసుకుంది. ఇక్కడి మూలపాడులోని కొత్త స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. దీంతో 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. మిడిలార్డర్లో డియాండ్ర డాటిన్ (101 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఈమెకు అగులెరియా (25) అండగా నిలిచింది. జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్ చెరో 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోరుు ఛేదించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (51 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1సిక్స్) మళ్లీ రాణించింది. ఓపెనర్ సృ్మతి మందన (62 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (32) ఆకట్టుకున్నారు. షకీరా సెల్మాన్, హేలీ, అఫీ ఫ్లెచర్, అనీసా తలా ఒక వికెట్ తీశారు. రేపు (మంగళవారం) ఇక్కడే చివరి వన్డే జరుగుతుంది. -
సెమీస్ ఆశలు గల్లంతు!
► వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మిథాలీసేన ► 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు ► మహిళల టి20 ప్రపంచకప్ ధర్మశాల: సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి నాకౌట్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మంచి సమన్వయంతో ఆడిన ఇంగ్లండ్ మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 90 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు), మిథాలీ రాజ్ (33 బంతుల్లో 20; 2 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. హీథర్ నైట్ 3 వికెట్లు తీసింది. తర్వాత ఇంగ్లండ్ 19 ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులు చేసింది. బీమోంట్ (18 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. స్కివెర్ (19), టేలర్ (16) ఓ మోస్తరుగా ఆడారు. భారత బౌలర్లు ఆరంభంలో విజృంభించినా.. చివర్లో ఫీల్డింగ్‌లో కొంప ముంచారు. విజయానికి 3 పరుగులు చేయాల్సిన దశలో శుబ్స్రోల్ (5 నాటౌట్) ఇచ్చిన క్యాచ్‌ను మిథాలీ జారవిడిచింది. ఆ తర్వాతి బంతికి ఆమె ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ సొంతమైంది. బిస్త్ 4 వికెట్లు తీసింది. స్కోరు వివరాలు: భారత్ మహిళల ఇన్నింగ్స్: వనిత (సి) గ్రీన్వే (బి) నైట్ 0; మందన (బి) శ్రుబ్సోల్ 12; మిథాలీ (సి) గ్రీన్వే (బి) స్కివెర్ 20; శిఖా పాండే (సి) బ్రూంట్ (బి) నైట్ 12; హర్మన్‌ప్రీత్ రనౌట్ 26; వేద కృష్ణమూర్తి (బి) నైట్ 2; గోస్వామి (సి) టేలర్ (బి) శ్రుబ్సోల్ 2; అనుజా పాటిల్ రనౌట్ 13; బిస్త్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1-0; 2-15; 3-44; 4-47; 5-52; 6-65; 7-87; 8-90. బౌలింగ్: నైట్ 4-0-15-3; బ్రూంట్ 4-0-24-0; శ్రుబ్సోల్ 4-0-12-2; గున్ 4-0-16-0; గ్రుండె 2-0-14-0; స్కివెర్ 2-0-7-1. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: ఎడ్వర్డ్స్ (సి) వర్మ (బి) బిస్త్ 4; బిమోంట్ (సి) అనుజా (బి) కౌర్ 20; టేలర్ (స్టం) వర్మ (బి) కౌర్ 16; నైట్ (స్టం) వర్మ (బి) బిస్త్ 8; స్కివెర్ (సి) మిథాలీ (బి) బిస్త్ 19; గ్రీన్వే ఎల్బీడబ్ల్యు (బి) బిస్త్ 0; యాట్ రనౌట్ 5; బ్రూంట్ నాటౌట్ 4; గున్ రనౌట్ 7; శ్రుబ్సోల్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (19 ఓవర్లలో 8 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1-10; 2-42; 3-42; 4-62; 5-62; 6-71; 7-79; 8-87. బౌలింగ్: అనుజా 4-0-22-0; జులన్ 2-0-10-0; బిస్త్ 4-0-21-4; రాజేశ్వరి 4-1-10-0; హర్మన్‌ప్రీత్ 4-0-22-2; వేద 1-0-4-0.