బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్
రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపు
విజయవాడ స్పోర్‌ట్స: భారత్‌పై గెలిచి ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన వెస్టిండీస్ మహిళలకు మిథాలీ సేన చేతిలో వరుస పరాజయాలు ఎదురవుతున్నారుు. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కై వసం చేసుకుంది. ఇక్కడి మూలపాడులోని కొత్త స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు.
దీంతో 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. మిడిలార్డర్‌లో డియాండ్ర డాటిన్ (101 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఈమెకు అగులెరియా (25) అండగా నిలిచింది. జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్ చెరో 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోరుు ఛేదించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (51 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1సిక్స్) మళ్లీ రాణించింది. ఓపెనర్ సృ్మతి మందన (62 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (32) ఆకట్టుకున్నారు. షకీరా సెల్మాన్, హేలీ, అఫీ ఫ్లెచర్, అనీసా తలా ఒక వికెట్ తీశారు. రేపు (మంగళవారం) ఇక్కడే చివరి వన్డే జరుగుతుంది.