ఆసీస్.. అదుర్స్ | Meg Lanning hails Australia’s start after World Twenty20 semi-final victory | Sakshi
Sakshi News home page

ఆసీస్.. అదుర్స్

Published Thu, Mar 31 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

ఆసీస్.. అదుర్స్

ఆసీస్.. అదుర్స్

ఫైనల్లోకి ప్రవేశం
చేజేతులా ఓడిన ఇంగ్లండ్
మహిళల టి20 ప్రపంచకప్


న్యూఢిల్లీ:  ఇంగ్లండ్ లక్ష్యం 20 ఓవర్లలో 133 పరుగులు.. ఓ దశలో జట్టు స్కోరు 90/2... ఇక గెలవాలంటే 36 బంతుల్లో 43 పరుగులు చేయాలి.. చేతిలో ఎనిమిది వికెట్లూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో సింగిల్స్, డబుల్స్ తీసినా సులువుగా లక్ష్యాన్ని చేరొచ్చు. కానీ ఈ సమయంలోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బౌలింగ్‌లో తడఖా చూపెట్టింది. కట్టుదిట్టమైన బంతులతో 28 పరుగుల తేడాలో కీలకమైన ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో బుధవారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ పోరుకి దూసుకెళ్లింది.

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. లాన్నింగ్ (50 బంతుల్లో 55; 6 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.  ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు), బీమౌంట్ (40 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అందరూ విఫలమయ్యారు. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరంకాగా, 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. షుట్ 2 వికెట్లు పడగొట్టింది.  ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement