![Nida Dar Becomes Leading Wicket Taker in Womens T20I History - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/21/Nida-Dar.jpg.webp?itok=VxL0VQu-)
పాకిస్తాన్ మహిళల జట్టు స్టార్ నిధా ధార్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిధాదార్ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టిన నిధా.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటివరకు 130 మ్యాచ్‌లు ఆడిన ఆమె 126 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ అనీషా మహ్మద్(125) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మహ్మద్ రికార్డును నిధా ధార్ బ్రేక్ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజాయం పాలైంది.
చదవండి: T20 WC 2023: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలో తొలి జట్టుగా!
Comments
Please login to add a commentAdd a comment