బంగ్లాదేశ్‌కు మరో ఓటమి | England win by 36 runs in Women's T-20 World Cup | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు మరో ఓటమి

Published Fri, Mar 18 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

England win by 36 runs  in Women's T-20 World Cup

36 పరుగులతో ఇంగ్లండ్ విజయం
మహిళల టి20 ప్రపంచకప్

 
బెంగళూరు: మహిళల టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 36 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (51 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా చివర్లో బ్రంట్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు), వ్యాట్ (8 బంతుల్లో 15; 2 ఫోర్లు) వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచారు. జహనర్ ఆలమ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం  బంగ్లా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓడింది.  నిగర్ సుల్తానా (28 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్), సల్మా ఖటూన్ (30 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement