
బ్రిడ్జ్‌టౌన్: ఆసీస్ బౌలర్ల దెబ్బకు మూడో వన్డేలో వెస్టిండీస్ చిత్తుగా ఓడిపోయి సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు కూడా ఆడని విండీస్ 45.1 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఎవిన్ లూయిస్ 55 నాటౌట్‌తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్ల దాటికి ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిచెల్ స్టార్క్ 3, హాజిల్‌వుడ్ 2, అగర్, జంపాలు చెరో రెండు వికెట్లు తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిను ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. లక్ష్య చేధనలో ఆసీస్ ఓపెనర్లు జోష్ ఫిలిప్(10), హెన్రిక్స్(1) వికెట్లను త్వరగానే కోల్పోయినా కెప్టెన్ అలెక్స్ క్యారీ 35, మిచెల్ మార్ష్ 29 పరుగులు చేశారు. ఇక చివర్లో ఆస్టన్ అగర్(19*) తో కలిసి మాథ్యూ వేడ్ 51 పరుగులు నాటౌట్‌గా నిలిచి లాంచనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, వాల్ష్, జోసెఫ్, హెసెన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకోగా.. అంతకముందు జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో విండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment