వడోదర : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.
ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్‌లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఎక్తాబిస్త్‌కు గాయం
భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది.
Comments
Please login to add a commentAdd a comment