హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి బంఫర్ ఆఫర్ తగిలింది. వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా రిషిత్ రెడ్డిను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారన్, అభిషేక్ పోరెల్, రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయి, పుష్పేంద్ర సింగ్ రాథోడ్‌ను వెస్టిండీస్‌కు బీసీసీఐ పంపనుంది. కాగా భారత శిబిరంలో ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.
భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అంతేకాకుండా శనివారం ఉగాండతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు. కాగా రిజర్వ్ ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నాక.. అక్కడ 6 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండునున్నారు. అనంతరం క్వార్టర్ ఫైనల్ సమయానికి జట్టులో చేరునున్నారు.
Comments
Please login to add a commentAdd a comment