Under-19 cricket worldcup
-
హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు!
హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి బంఫర్ ఆఫర్ తగిలింది. వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా రిషిత్ రెడ్డిను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారన్, అభిషేక్ పోరెల్, రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయి, పుష్పేంద్ర సింగ్ రాథోడ్‌ను వెస్టిండీస్‌కు బీసీసీఐ పంపనుంది. కాగా భారత శిబిరంలో ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అంతేకాకుండా శనివారం ఉగాండతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు. కాగా రిజర్వ్ ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నాక.. అక్కడ 6 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునున్నారు. అనంతరం క్వార్టర్ ఫైనల్ సమయానికి జట్టులో చేరునున్నారు. -
వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్!
New Zealand Pull Out of U19 WC for Quarantine Restrictions: వచ్చే ఏడాది కరేబియన్ దీవుల్లో జరగనున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ గ్రూపుల వివరాలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. అయితే ఈ ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ అండర్-19 జట్టు అనుహ్యంగా చివరి నిమిషంలో తప్పుకుంది. న్యూజిలాండ్‌లో ప్రస్తుతం కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు అవుతున్నాయి. ఈ క్రమంలో టీనేజర్లు దేశం దాటి వెళ్లి వస్తే కఠినమైన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉండాలి. దీంతో పలువురు క్రికెటర్లు విముఖత చూపడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా న్యూజిలాండ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ను చివరి నిమిషంలో చేర్చారు. ఇక 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇంగ్లండ్. గ్రూప్ ‘బి’లో ఉగాండ, ధక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి గత ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు చోటు కల్పించారు. గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా. గ్రూప్ ‘డి’లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లుకు అవకాశం కల్పించారు. కాగా అండర్-19 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ తొలి సారి అతిథ్యం ఇవ్వబోతుంది. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి.. Here's #TeamIndia's schedule for the ICC Under 19 Men's Cricket World Cup 2022 🔽 pic.twitter.com/7c2eOoIN8Y — BCCI (@BCCI) November 17, 2021 -
శ్రీలంక టార్గెట్ 268
మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంకకు భారత్ 268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యువభారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. అనమోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59) అర్ధసెంచరీలతో రాణించారు. 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్(43)తో కలిసి నాలుగో వికెట్ కు అనమోల్ ప్రీత్ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్మాన్ జాఫర్ 29, లోమరొర్ 11, దాగర్ 17, ఆర్ పంత్ 14 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండొ 4 వికెట్లు పడగొట్టాడు. కుమార, నిమేశ్ రెండేసి వికెట్లు తీశారు. -
శ్రీలంక ఫీల్డింగ్.. భారత్ బ్యాటింగ్
మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భాగంగా టు స్థానిక షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో యువభారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. సిరీస్ ఆరంభం నుంచి జోరుమీదున్న భారత్ శ్రీలంకను ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉన్నారు. ప్రపంచకప్ కల సాకారం చేసుకునేందుకు లంకను కచ్చితంగా జయించాలనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు. అత్యుత్తమ ఆటతీరు చూపి శ్రీలంకను ఓడించాలని ఉత్సాహంగా ఉన్నారు. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుని మంచి ఊపు మీదున్న యువశ్రీలంక కూడా సత్తా చాటాలని భావిస్తోంది.