భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ హైవోల్టేజ్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. ఆండర్సన్ స్ధానంలో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు మేనెజ్‌మెంట్ ఛాన్స్ ఉంది.
కాగా ఈసీబీ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడే కావడం గమనార్హం. అనూహ్యంగా ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. స్పినర్ల కోటాలో రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్‌లీ చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్
చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment