![mohammed siraj arrives hyderabad fans welcomes him](/styles/webp/s3/article_images/2024/07/5/mohammedsiraj.jpg.webp?itok=EtfYgOBY)
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సొంత గడ్డపై అడుగు పెట్టాడు. ఢిల్లీలో టీమిండియా విక్టరీ బస్ పరేడ్ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌కు అభిమానలు ఘనస్వాగతం పలికారు.
ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ అతడికి జేజేలు పలికారు. సిరాజ్ మియాతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అనంతరం మహ్మద్ సిరాజ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. మెహిదీపట్నం నుంచి ఈద్‌గహ్ గ్రౌండ్‌లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీగా వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా సిరాజ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా ఆపూర్వ స్వాగతం పలికింది. హైదరాబాద్.. వరల్డ్‌కప్ హీరో మహమ్మద్ సిరాజ్ స్వాగతం పలకుతుందని ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
కాగా టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్ నిలవడంలో సిరాజ్ తన వంతు పాత్ర పోషించాడు. అమెరికా వేదికగా జరిగిన లీగ్ స్టేజి మ్యాచ్‌ల్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రాకతో మిగిలిన మ్యాచ్‌లకు సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
#WATCH | Cricket fans welcome Mohammed Siraj on his return to Hyderabad after winning the T20I Cricket World Cup pic.twitter.com/aEzskY51vG
— ANI (@ANI) July 5, 2024
Comments
Please login to add a commentAdd a comment