టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. గ్రూపు-ఎ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేన అదరగొట్టింది.
తొలుత బౌలింగ్‌లో 110 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటింది. 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకుముందు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
సిరాజ్ సూపర్ క్యాచ్..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో అమెరికా బ్యాటర్ నితీష్ కుమార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్‌లో నాలుగో బంతిని నితీష్ కుమార్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫుల్ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు.
కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో సిరాజ్ బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. అయినప్పటకి బంతిని మాత్రం జారవిడచలేదు. సిరాజ్ క్యాచ్ చూసిన ప్రతీఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Siraj took a stunner pic.twitter.com/kJYMmupOS5
— mohsinali (@mohsinaliisb) June 12, 2024
Comments
Please login to add a commentAdd a comment