
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్ పట్టంది ఈజీ క్యాచే అయినా అంతటి ఒత్తిడిలో బంతిని ఒడిసిపట్టడం అంత సులభం కాదు.
అప్పుడు ఏ క్యాచ్ అయితే భారత్‌ను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిందో.. ఇప్పుడు అటువంటి మరో అద్భుత క్యాచే 17 ఏళ్ల తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది.
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ అద్బుతం చేశాడు. సూర్య సంచలన క్యాచ్‌తో భారత్ రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.
అసలేం జరిగిందంటే?
దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకులతో పాటు టీవీల ముందు కూర్చుకున్న భారత అభిమానల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ సమయంలో తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.
ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ మేన్ సూర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.
What A Catch By Suryakumar Yadav 🔥🔥
Game changing catch 🥹❤️
Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024