
టీ20 వరల్డ్‌కప్-2024 గ్రూపు స్టేజిలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.
లీగ్ స్టేజిలో కనబరిచిన జోరునే సూపర్-8 రౌండ్‌లో కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 20న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ గాయపడ్డాడు. త్రోడౌన్స్ స్పెషలిస్ట్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతికి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది.
అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య తిరిగి మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు స్పోర్ట్‌స్టాక్ తమ నివేదికలో పేర్కొంది. సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సూర్యకుమార్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ గానీ బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment