టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గోనేందుకు భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఆదివారం న్యూయర్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
ఈ వార్మాప్ మ్యాచ్‌కు ముందు టీమిండియా న్యూయర్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం తమ మొదటి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఈ కొత్త స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ పిచ్‌లపై రోహిత్ అండ్ కో తీవ్రంగా శ్రమించారు. అయితే బుధవారం న్యూయార్క్‌లో వర్షం భారీగా కురిసినప్పటికి.. నేడు(గురువారం) మాత్రం భారత ప్రాక్టీస్‌కు వరుణుడు ఎటువంటి ఆటంకం కలిగించలేదు.
చెమటోడ్చిన హార్దిక్ పాండ్యా..
ఈ క్రమంలో మిగిలిన ఆటగాళ్ల కంటే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా చెమటోడ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని హార్దిక్ ప్రాక్టీస్ చేశాడు. జట్టుతో ఇటీవలే కలిసిన పాండ్యా.. తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాదాపు నెట్స్‌లో గంటకు పైగా హార్దిక్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు.
కాగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ పాండ్యా విఫలయ్యాడు. అయినప్పటికి తనకు ఉన్న అనుభవం దృష్ట్యా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో చోటిచ్చారు.
కానీ సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది మాజీలు విమర్శల వర్షం కురిపించారు. ఫామ్‌లో లేని ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెలక్టర్ల నమ్మకాన్ని హార్దిక్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో మరో 5 రోజు ఎదురు చూడాల్సిందే.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
Comments
Please login to add a commentAdd a comment