టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది.
కాగా ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కొంచెం కష్టపడింది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది.
భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) పరుగులతో ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో భారత టాపర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), రోహిత్ శర్మ(3), రిషబ్ పంత్(18) పరుగులతో నిరాశపరిచారు. అమెరికా బౌలర్లలో నెత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు.
చెలరేగిన అర్ష్‌దీప్..
తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది.
అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్(27), టేలర్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment