లండన్: ఐసీసీ తాజాగా టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు.
చదవండి:లార్డ్స్ టెస్ట్‌లో ఆండర్సన్, బుమ్రా ఎపిసోడ్‌పై మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్‌ను ప్రెజెంటర్ అడగ్గా..ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగిఉంటే టీమిండియా ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో ప్రపంచకప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఎందుకంటే వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, పోలార్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారని స్వాన్ తెలిపాడు. కాగా ఇటీవల ఇటీవల స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన టి 20 సిరీస్‌లో కరీబీయన్లు విజయం సాధించి టీ20 ప్రపంచకప్ కు ముందే సవాల్ విసిరారు అని స్వాన్ అన్నాడు. మరో వైపు విండీస్ ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపిఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ వెళ్తున్నారని.. అది వారికి ఎంతగానో కలిసి వచ్చే ఆంశమని స్వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను విండీస్ గెలుచుకుంది.
చదవండి:IPL 2021: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్‌కే పేస్ దళం
Here's why @Swannyg66 believes @windiescricket are the favourites to lift the ICC Men's #T20WorldCup 💬
— T20 World Cup (@T20WorldCup) August 22, 2021
Hear more from the former 🏴 spinner on Around The Wicket with @DanishSait, driven by @Nissan, premiering today 🤩 pic.twitter.com/M3nnAwdyky
Comments
Please login to add a commentAdd a comment