Graeme Swann
-
ప్లీజ్.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్ తుది అంకానికి చేరుకుంది. బుధవారం(జూన్ 7) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సైకిల్ ముగియనుంది. ఇక లండన్ వేదికగా జరగన్న తుదిపోరులో భారత్- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాని స్వాన్ అన్నాడు. ఓవల్ మైదానంలో జూన్ ఆరంభంలో మ్యాచ్ జరగుతుంది కాబట్టి పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉందని, పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో స్వా్న్ మాట్లాడుతూ.. ఓవల్ పిచ్‌పై గ్రాస్ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓవల్ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరిగానే ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్లను తీసుకువస్తే బాగుంటుంది. ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్ డిఫెండ్ చేసుకోవడానికి భారీ స్కోర్ సాధించాలి. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్ క్లాస్ టీమ్స్. కానీ ఒక ఇంగ్లీష్ మ్యాన్‌గా ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే చూడాలని ఉంది. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్ బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఆసీస్‌కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని పేర్కొన్నాడు. చదవండి: WTC Final 2023: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్‌కు అవకాశం దక్కేనా? మరి అశ్విన్! -
ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే!
-
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. వరల్డ్‌కప్ విజేత ఆ జట్టే!
వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మాజీ క్రికెటర్లు మాత్రం ఇప్పటి నుంచే విజేత ఎవరన్నది అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ను ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకోనే ఛాన్స్ ఉంది అని స్వాన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ ట్విన్స్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తమ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్ కచ్చితంగా విజేతగా నిలుస్తుందని స్వాన్ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్, నూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ ఏడాది సీజన్లో 30 వికెట్లు పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డిజిటిల్ బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో స్వాన్ మాట్లాడుతూ.. భారత్‌లో మణికట్టు స్పిన్నర్లను చూసి ప్రతీ దేశం ఆసూయపడాలి. ఆఫ్గానిస్తాన్ మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఆఫ్గాన్‌లో రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. వీరిద్దరూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్ జట్టు కచ్చితంగా ప్రపంచకప్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా! -
క్యాచ్ పట్టగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ స్టార్ స్పిన్నర్ గ్రేమీ స్వాన్ టి10 యూరోపియన్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఆటగాడిగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే స్వాన్ ఆ క్యాచ్ అందుకుంది ఒక ప్రేక్షకుడిగా. విషయంలోకి వెళితే.. టి10 యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇటలీ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్స్‌లో ఉన్న గ్రేమీ స్వాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తాను పట్టుకున్న బంతితో స్టాండ్స్ మొత్తం కలియ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రేమీ స్వాన్ ఇంగ్లండ్ తరపున మంచి స్పిన్నర్‌గా పేరు పొందాడు. ఇంగ్లీష్ జట్టు తరపున స్వాన్ 60 టెస్టుల్లో 255 వికెట్లు, 70 వన్డేల్లో 104 వికెట్లు, 39 టి20ల్లో 51 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటలీ చేతిలో స్విట్జర్లాండ్ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు భారీ స్కోరు చేసింది. అమిర్ షరీఫ్ 24 బంతుల్లో 64 నాటౌట్, రాజ్మణి సింగ్ 18 బంతుల్లో 51, బల్జీత్ సింగ్ 17 బంతుల్లో 50 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. And @Swannyg66 grabs another one! Absolute scenes in Cartama😄 #EuropeanCricketChampionship #ECC22 #CricketinSpain pic.twitter.com/edTwcCrKPQ — European Cricket (@EuropeanCricket) October 6, 2022 చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' -
'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు.. కోహ్లిని పంపండి'
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ బౌలింగ్‌లో భారత్ దుమ్మురేపింది. అయితే తొలి టీ20లో భారత బ్యాటర్లు అంతా రాణించన్పటికీ.. ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టీ20లో ఇషాన్ కిషన్‌కు బదులుగా కోహ్లి భారత్‌కు ఓపెనింగ్ చేయాలని స్వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి వంటి ఆటగాడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాకూడదని అతడు తెలిపాడు. ఇక తొలి టీ20కి విశ్రాంతి తీసుకున్న కోహ్లి రెండో టీ20కు సిద్దమయ్యాడు. "విరాట్ తుది జట్టులోకి వచ్చినట్లయితే.. అతడు కిషన్ బదులుగా ఓపెనింగ్ చేయాలని భావిస్తున్నాను. కోహ్లి వంటి అద్భుతమైన ఆటగాడిని మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపకూడదు. కోహ్లి ఆస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే అంత త్వరగా పరుగులు చేయలేడు. కాబట్టి కోహ్లి ఓపెనర్ గానే రావాలి. రోహిత్ అవతలి ఎండ్‌లో దూకుడుగా ఆడితే కోహ్లి కూడా అతడిని ఫాలో అవుతాడు. వీరిద్దరూ భారీ స్కోర్లు సాధించి భారత్‌కు అద్భుతమైన ఆరంభం ఇస్తే.. తర్వాత వచ్చే హూడా, సూర్య తమ పని తాము చేసుకు పోతారు" అని స్వాన్ పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 198/8 (20) ఇంగ్లండ్ స్కోరు: 148 (19.3) విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) -
Graeme Swann: టీమిండియా ఓడిపోవడం మంచిదే అయ్యింది..
Graeme Swann Comments On Team India Loss: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలోని తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తుందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 24న పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేనకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్ చేతిలో అపజయం ఎరుగని భారత జట్టు అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో గ్రేమ్ స్వాన్ క్రికెట్.కామ్‌తో మాట్లాడుతూ.. ‘‘కొన్ని సార్లు టోర్నీ ఆరంభంలోనే భారీ తేడాతో ఓడిపోవడం మంచే చేస్తుంది. ఎందుకంటే... ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. పడిలేచినా కెరటంలా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కదా ఐపీఎల్ ముగిసింది. వాళ్లు(టీమిండియా ఆటగాళ్లు) అలసిపోయి ఉన్నారు. అయితే, ప్రతి ఒక్కరు టీమిండియానే ఫేవరెట్ అంటున్నారు. వాళ్లు ఓటమి నుంచి త్వరగానే కోలుకుంటారు. ముందుకు సాగుతారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రదర్శన గురించి చెబుతూ... ‘‘వాళ్లు చాలా చాలా డేంజర్ టీమ్. అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవచ్చు లేదంటే... ప్రతి మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించనూ గలదు. అంతే సులువుగా టోర్నమెంట్ గెలవనూగలదు. పాకిస్తాన్ నిజంగా ప్రమాదకర జట్టు’’ స్వాన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: Ashish Nehra: రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు.. అయితే.. MS Dhoni: ఓటమి అనంతరం.. పాక్ ఆటగాళ్లతో ధోని ముచ్చట.. వీడియో వైరల్ Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్.. అసలు రాహుల్ అవుట్ కాలేదు.. అది నో బాల్.. కావాలంటే చూడండి’ -
‘టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్ కాదు.. ఆ జట్టే గెలుస్తుంది’
లండన్: ఐసీసీ తాజాగా టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. చదవండి:లార్డ్స్ టెస్ట్‌లో ఆండర్సన్, బుమ్రా ఎపిసోడ్‌పై మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్‌ను ప్రెజెంటర్ అడగ్గా..ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగిఉంటే టీమిండియా ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో ప్రపంచకప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, పోలార్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారని స్వాన్ తెలిపాడు. కాగా ఇటీవల ఇటీవల స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్లతో జరిగిన టి 20 సిరీస్‌లో కరీబీయన్లు విజయం సాధించి టీ20 ప్రపంచకప్ కు ముందే సవాల్ విసిరారు అని స్వాన్ అన్నాడు. మరో వైపు విండీస్ ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపిఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ వెళ్తున్నారని.. అది వారికి ఎంతగానో కలిసి వచ్చే ఆంశమని స్వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను విండీస్ గెలుచుకుంది. చదవండి:IPL 2021: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం Here's why @Swannyg66 believes @windiescricket are the favourites to lift the ICC Men's #T20WorldCup 💬 Hear more from the former 🏴 spinner on Around The Wicket with @DanishSait, driven by @Nissan, premiering today 🤩 pic.twitter.com/M3nnAwdyky — T20 World Cup (@T20WorldCup) August 22, 2021 -
అందుకే టీమిండియా ఓడిపోయింది.. కానీ: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి విరాట్ కోహ్లిని బాధ్యుడిని చేస్తూ సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనడం సరికాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. కోహ్లిని గనుక కెప్టెన్సీ నుంచి తప్పిస్తే క్రికెట్ పట్ల పెద్ద నేరం చేసినవారవుతారని వ్యాఖ్యానించాడు. అతడు వంద శాతం నిబద్ధతతో ఆడతాడని, అలాగే జట్టును ముందుండి నడిపిస్తాడని పేర్కొన్నాడు. కేవలం సన్నద్ధలేమి వల్లే భారత జట్టు ఓడిపోయిందని, అంతేతప్ప ఇందుకు కోహ్లి కారణం కాదని చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టు కూర్పు సరిగ్గా లేనందుకు వల్లే పరాజయం పాలవ్వాల్సి వచ్చిందని, ఇందుకు కోహ్లినే బాధ్యత వహించాలని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ జట్టు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ... ‘‘విరాట్ కోహ్లి ఓ చాంపియన్. తనకొ సూపర్‌స్టార్. భారత జట్టులో జవసత్వాలు నింపాడు. వికెట్లు పడినప్పుడు, మిస్‌ఫీల్డింగ్ జరిగినపుడు తన ముఖంలో వచ్చే మార్పులు అతడి మానసిక స్థితిని తెలియజేస్తాయి. పూర్తి నిబద్ధతతో తన బాధ్యతలు నెరవేరుస్తాడు. కానీ ఒక్క ఓటమి కారణంగా తనను తొలగించాలని మాట్లాడటం పద్ధతి కాదు. ఇంత మంచి కెప్టెన్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తే పెద్ద నేరం చేసినట్లే లెక్క. వాళ్లు(భారత జట్టు యాజమాన్యం) కెప్టెన్ మార్పు గురించి అస్పలు ఆలోచించరనే అనుకుంటున్నా. నిజానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది. సౌథాంప్టన్‌లో వారికి తగినంత నెట్ ప్రాక్టీసు లభించలేదు. అదే సమయంలో న్యూజిలాండ్‌కు కావాల్సినంత సమయం దొరికింది. అదే వారికి అడ్వాంటేజ్‌గా మారింది’’ అని ఫైనల్ ఫలితానికి గల కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేశాడు. చదవండి: WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో! -
14.25 కోట్లా: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు!
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించాడు. తన విధ్వంసకర ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2021లో భాగంగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాక్సీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 9 ఫొర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్‌తో పాటు డివిలియర్స్ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు, బౌలర్లు కైల్ జేమీసన్ (3/41), హర్షల్ పటేల్ (2/17), యజువేంద్ర చహల్ (2/34) రాణించడంతో కేకేఆర్‌పై ఆర్సీబీ విజయభేరి మోగించింది. తద్వారా ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ మాక్స్వెల్ ఇన్నింగ్స్‌పై స్పందించిన గ్రేమ్‌స్వాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అందరికంటే ఎక్కువగా తను నన్ను ఆశ్చర్యపరిచాడు. బెంగళూరు ఫ్రాంఛైజీ అతడి కోసం మరీ ఎక్కువ మొత్తం ఖర్చు చేసిందని భావించాను. కానీ నా అభిప్రాయం తప్పని అతడు నిరూపించాడు. యాజమాన్యం సైతం తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామంటూ పూర్తి నమ్మకం ఉంచింది. దానిని నిలబెట్టుకున్నాడు. వైఫల్యాల నుంచి బయటపడి పూర్వపు ఫాంలోకి వచ్చాడు. మంచి మంచి షాట్లు ఆడుతున్నాడు. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉంటాడు. ప్రస్తుతం మాక్సీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి మరింత విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా, కోహ్లి, డివిలియర్స్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నపుడు మాక్స్వెల్ తన సహజమైన ఆటతీరును ప్రదర్శించేందుకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాడు. తన ప్రదర్శనను బిగ్ షోగా అభివర్ణించిన స్వాన్, జట్టులో మూడో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు. కాగా గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన మాక్స్వెల్ 13 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ అతడిని వదులుకోగా, మినీ వేలం-2021లో భాగంగా ఆర్సీబీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో యాజమాన్యం నిర్ణయం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. గత సీజన్లో విఫలమైన ఆటగాడి కోసం భారీ మొత్తం వెచ్చించడం పట్ల రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇక మాక్సీ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం ఇస్తున్నాడు. స్కోర్లు: ఆర్సీబీ- 204/4 (20) కేకేఆర్- 166/8 (20) చదవండి: సిరాజ్ మొత్తం మారిపోయాడు: కోహ్లి ఇంత స్కోరా... నేను అంతే: ఏబీడీ -
కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించింది
అహ్మదాబాద్: మొటేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాగ్వాదంలో కోహ్లి ప్రవర్తన నాకు చిన్న పిల్లాడిలా అనిపించిందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్ తెలిపాడు. గొడవ జరిగిన సమయంలో మ్యాచ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న స్వాన్ పై వ్యాఖ్యలు చేశాడు. '' కోహ్లి ప్రవర్తన నాకు నచ్చలేదు. సిరాజ్‌ను చూస్తూ అసహనం వ్యక్తం చేస్తూ నిలబడిన స్టోక్స్‌తో కోహ్లి మాటల యుద్దానికి తెరతీశాడు. బంతి వేసిన తర్వాత ఫీల్డర్లు యధాస్థానానికి వెళ్లిపోవాలి.. కానీ కోహ్లి అలా చేయలేదు. ఒక బౌలర్, బ్యాట్స్‌మన్ సంభాషణ మధ్యలో దూరడం సరికాదు. ఇదంతా చూస్తే కోహ్లి మనసత్త్వం చిన్న పిల్లాడిలా అనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విషయంలోకి వెళితే.. మహ్మద్ సిరాజ్ వేసిన 12వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో స్టోక్స్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్.. ఏదో అనబోయాడు. అయితే సిరాజ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కానీ కోహ్లి మాత్రం స్టోక్స్ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అయితే అంతలోనే అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు.. బెయిర్ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లతో రాణించగా.. అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ ఒక వికెట్ తీశాడు. చదవండి: నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్ మధ్య వాగ్వాదం! పంత్ ట్రోలింగ్.. వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ Virat - Ben Stokes 😠 Ben - Yeah ,Virat What you saying ? Virat - Nothing,you won't get it Ben - Ohh I got it 👀 #INDvsENG#ViratKohli#benstokespic.twitter.com/7BCZhHicEt — ¶ Mahesh ¶ (@CloudyMahesh) March 4, 2021 -
'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి'
లండన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-1తో ఓడించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆసీస్‌పై స్టన్నింగ్ విక్టరీ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు నూతనొత్తేజంతో సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్ ఇంగ్లండ్ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో స్వాన్ మాట్లాడాడు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఇదే నా హెచ్చరిక.. రానున్నది కఠినమైన సిరీస్.. ఎందుకంటే టీమిండియా స్వదేశంలో సింహంలా గర్జింస్తుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆ జట్టు మరింత బలోపేతంగా తయారైంది. ఎప్పుడో జరిగే యాషెస్ సిరీస్‌ను పక్కనబెట్టి టీమిండియాతో జరిగే సిరీస్ గురించి ఆలోచించండి. అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోకుండా.. భారత్‌ను ఎలా ఓడించాలన్న దానిపై దృష్టి పెడితే బాగుంటుంది. 2012 తర్వాత మనం టీమిండియాను వారి గడ్డపై ఓడగొట్టలేకపోయాం.. టీమిండియా పిచ్‌లె స్పిన్నర్లకు స్వర్గధామం.. కాబట్టి రానున్న సిరీస్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి.. బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడితే తప్ప భారత్‌పై గెలవడం అసాధ్యం. 'అని తెలిపాడు.చదవండి: ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న గ్రేమ్ స్వాన్ ఇంగ్లండ్ తరపున 60 టెస్టుల్లో 255, 79 వన్డేల్లో 104, 39 టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. కాగా ఇంగ్లండ్ జట్టు పర్యటన వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా జరగనుంది. చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్ అయినందుకు గర్విస్తున్నా' -
'అతని బ్యాటింగ్ చూసి 11ఏళ్ల స్పిన్నర్లా ఫీలయ్యా'
లండన్ : టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జీవితంలో ద్రవిడ్‌ను మించిన అత్యుత్తమ ఆటగాడిని చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.' నా వరకు రాహుల్ ద్రవిడ్ అందరి కంటే గొప్ప బ్యాట్స్‌మన్. కౌంటీల్లో అతడికి నేను బౌలింగ్ చేశా. అతను ఒక అసాధారణంగా ఆటగాడు. అతడి కంటే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను నేను నా జీవితంలో చూడలేదు. ఓ కౌంటీ గేమ్‌లో ద్రవిడ్ అసలు ఔటే కాలేదు.. అప్పుడు ద్రవిడ్ అంటే ఇదేనేమోనని అనిపించింది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే నేను 11 ఏండ్ల స్పిన్నర్లా ఫీలయ్యా. 2008లో చెన్నైలో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన నేను తొలి ఓవర్లోనే గంభీర్‌తో పాటు ద్రవిడ్‌ను కూడా ఔట్ చేశాను. ఆ విషయాన్ని ఇప్పటివరకు నేను మరిచిపోలేదు. నిజంగా అది అద్భుతమైన బంతేనని కానీ ద్రవిడ్‌ను ఔట్ చేయగలిగినంత గొప్పది మాత్రం కాదని' గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు. మిస్టర్ డిపెండబుల్‌గా పేరు పొందిన ద్రవిడ్ తన కెరీర్లో 163 టెస్టులు ఆడి13,265 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు. ఎన్నోసార్లు ఆపదలో ఉన్న భారత జట్టును ఆదుకొని, పరాజయాల నుంచి తప్పించి 'ది వాల్'గా పేరును దక్కించుకున్నాడు. (క్లాప్స్ కొట్టడానికి వీధుల్లోకి వస్తారా..?) -
మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!
లండన్: ఇంగ్లండ్ క్రికెట్లో కెవిన్ పీటర్సన్ ఒక దిగ్గజ ఆటగాడైతే, గ్రేమ్ స్వాన్ కీలక స్పిన్నర్‌గా చాలాకాలం కొనసాగాడు. అయితే తామిద్దరం కలిసి ఆడిన సందర్భాల్లో ఒకరంటే ఒకరి ఇష్టం ఉండేది కాదని, తమ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండేది కాదని అంటున్నాడు గ్రేమ్ స్వాన్. ఒకే జట్టులో ఉన్నా పీటర్సన్‌కు, తనకు పరస్పరం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలుండేవనే విషయం క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసన్నాడు. కాగా, పీటర్సన్ జట్టులో ఉండాలని తాను కోరుకునే వాడినని స్వాన్ పేర్కొన్నాడు. పీటర్సన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మితిమీరిన నిబంధనలను ఇష్టపడే వాడు కాదని స్వాన్ తెలిపాడు. (‘నాకు చెల్లి ఉంటే స్టోక్స్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాడ్ని’) ‘జట్టులో పీటర్సన్ ఉండాలని నేను కోరుకునే వాడిని. ఎందుకంటే అతడు భారీ స్కోర్లు చేసేవాడు. బాగా ఆడేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతడు ఒకడు’అని స్వాన్ చెప్పాడు. కాకపోతే వ్యక్తిగతంగా మాత్రం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఎందుకో పీటర్సన్ అంటే తనకు ఇష్టం ఉండేది కాదని, అలానే పీటర్సన్ కూడా తనతో సఖ్యతగా ఉండేవాడు కాదన్నాడు. 2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా, 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. (‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’) -
‘నాకు చెల్లి ఉంటే స్టోక్స్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాడ్ని’
లీడ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో ఓటమి అంచుల వరకూ వెళ్లిన ఇంగ్లండ్ తిరిగి పుంజుకుని అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో ఆ దేశ క్రికెటర్లు, మాజీలు ఉబ్బితబ్బి అయిపోతున్నారు. ఇంగ్లండ్ విజయానికి ప్రధాన కారణమైన బెన్ స్టోక్స్‌ను మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందులో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అయితే స్టోక్స్‌ను ‘బావ’ను చేసుకోవాలని ఉందని పేర్కొన్నాడు. అయితే తనకు అక్కా చెల్లెల్లు లేరన్నాడు. ‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం కచ్చితంగా అతడికిచ్చి పెళ్లి చేసేవాడిని’ అని స్వాన్ పేర్కొన్నాడు. స్వాన్ ట్వీట్ ను విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘నాకైతే చెల్లెల్లు లేరు. కానీ ఒకరిని దత్తత తీసుకుని అతడికిచ్చి పెళ్లిచేయమని మా అమ్మను అడుగుతాను అని ఒకరు ట్వీట్ చేయగా, ‘ఇది 21వ శతాబ్దం స్వాన్, నువ్వే అతడిని పెళ్లి చేసుకోవచ్చు’ అని మరొకరు ట్వీట్ చేశారు. కాగా, యాషెస్ మూడో టెస్టులో ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఇంకా వికెట్ మిగిలి ఉండగా ఛేదించింది. బెన్ స్టోక్స్ (219 బంతుల్లో 135 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు గెలుపును అందించాడు. 286 వద్ద 9వ వికెట్ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టోక్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
‘స్వింగ్ కాకపోతే టీమిండియాతో కష్టమే’
లీడ్స్ : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంతి స్వింగ్ కాకపోతే టీమిండియాను ఓడించడం కష్టమేనని ఇంగ్లండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేడి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో బంతి స్వింగ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రేమ్ స్వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''బంతి కనుక స్వింగ్ కాకపోతే, ఇంగ్లండ్ రివర్స్ స్వింగ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. రివర్స్ స్వింగ్ అయ్యే సమయానికి అండర్సన్ బౌలింగ్‌లో వేడి తగ్గవచ్చు. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన సిరీస్‌లో బంతి ఆరంభం నుంచే స్వింగ్ కావడంతో అండర్సన్ విజృంభించాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు అండర్సన్‌ను ఎదుర్కోకూడదనే ప్రపంచంలో ప్రతి బ్యాట్స్‌మెన్ కోరుకుంటాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో బంతి స్వింగ్ అయితే ఇంగ్లండ్ సులభంగా గెలుస్తుంది. ఒకవేళ స్వింగ్ కాకపోతే ఫలితం వేరేలా ఉండొచ్చు. ఇలా భారత్ సిరీస్‌లో పుంజుకునే అవకాశాలున్నాయి. నా వరకూ అయితే స్వింగ్ ఉండదనే అనుకుంటున్నా’’ అని స్వాన్ తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మద్య బర్మింగ్ హామ్ వేదికగా ఆగస్టు 1న తొలి టెస్టు ఆరంభం కానుంది. -
బెన్ స్టోక్స్ లేకపోవడం వల్లే...
పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనబడిందని ఆ దేశ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ లేకపోవడంతో తమ జట్టు ఒక్కసారిగా బలహీనపడిపోయిందన్నాడు. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఉండగానే యాషెస్‌ను కోల్పోవడానికి కారణం తమ ప్రధాన ఆటగాళ్లైన జో రూట్, అలెస్టర్ కుక్‌లు విఫలం కావడమేనని స్వాన్ విమర్శించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ఏ మాత్రం పోరాడి అవకాశం లేకుండా చేశారన్నాడు. అయితే ఇంగ్లండ్ సంచలనం డేవిడ్ మాలన్పై స్వాన్ ప్రశంలస వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతని ఆట తీరు మినహా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందన్నాడు. తమ జట్టులో స్టోక్స్ లేకపోవడం వల్ల తొలి మూడు గేమ్‌ల్లోనే సిరీస్‌ను కోల్పోతుందనే విషయాన్ని ముందే అంచనా వేసినట్లున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3తో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను ముందుగానే ఆసీస్‌కు సమర్పించుకుంది. -
నోరు జారిన గ్రేమ్ స్వాన్!
లండన్:తమ దేశంలో స్పిన్నర్ల పట్ల వ్యవహరించే తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నోరు జారాడు. అసలు ఇంగ్లండ్‌లో స్పిన్నర్లను గుర్తించకపోవడం ఒకటైతే, వారిని మూడో తరగతి ప్రజల వలే చూస్తారంటూ తీవ్రంగా విమర్శించాడు. అదే ఇంగ్లండ్‌లో స్పిన్‌పై అంత ఆసక్తి కనబరచకపోవడానికి కారణమని స్వాన్ పేర్కొన్నాడు. 'మాకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండరు. అందుకు కారణం మమ్మల్ని ట్రీట్ చేసే విధానమే. మూడో తరగతికి చెందిన క్రికెటర్ల తరహాలో చూస్తారు. దాంతో స్పిన్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టం. మాకు ఉపయోగపడని మంచి జట్టు ఉంటుంది. ఉపయోగపడని మంచి క్రికెటర్లు ఉంటారు. దాంతో భారత్‌తో జరుగబోయే సిరీస్ లను కోల్పోతాం. కారణం.. స్పిన్నర్లను చిన్నచూపు చూడటమే' అని స్వాన్ ధ్వజమెత్తాడు. ప్రస్తుతం జరగబోయే టెస్టు సిరీస్‌లో భారత్ ను ఒకసారి కుదురుకోనిస్తే ఇంగ్లండ్ కోలుకోవటం అంత ఈజీ కాదన్నాడు. -
స్టార్ బౌలర్‌పై స్వాన్ సంచలన వ్యాఖ్యలు!
లండన్: గత ఆరు సంవత్సరాల క్రితం తమతో టెస్టు మ్యాచ్ సందర్బంగా స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహ్మద్ ఆమిర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆమిర్‌ను తిరిగి క్రికెట్లో ఎందుకు ఆహ్వానించారంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జీవిత కాలం నిషేధం విధించాల్సిన బౌలర్‌కు పునరాగమనం ద్వారా ఆడే అవకాశం కల్పించడం కచ్చితంగా పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు. '2010లో నో బాల్స్ వేయడం ద్వారా ఫిక్సింగ్ కు పాల్పడిన ఆమిర్ పై జీవితం కాలం నిషేధం విధించి ఉండాల్సింది. ఆటలో పారదర్శకతను కోరితే అటువంటి వారిని తిరిగి జట్టులో ఆడే అవకాశం ఎందుకు కల్పిస్తారు. ఆమిర్ లాంటి వాళ్లను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేకుండా చేస్తే అది క్రికెట్ ఎదుగుదలకు దోహద పడుతుంది. దాంతో పాటు యువ క్రికెటర్లకు కూడా అదొక ఆదర్శవంతంగా నిలుస్తుంది. అవినీతికి పాల్పడే వారికి జట్టులో స్థానం అనేది ఉండకూడదు 'అని స్వాన్ ధ్వజమెత్తాడు. అయితే అంతకుముందు ఆమిర్ పై తమకు ఎటువంటి ద్వేషం లేదని ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోని సభ్యులు కొందరు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో పాటు, స్టువర్ట్ బ్రాడ్ లు ఆమిర్ ను స్వాగతిస్తున్న తరుణంలో ఆ దేశానికే చెందిన స్వాన్ భిన్నమైన వైఖరి వ్యక్తం చేయడం గమనార్హం. -
అశ్విన్‌ను ఆడించాల్సింది
గ్రేమ్ స్వాన్ వ్యాఖ్య లండన్: విదేశీ గడ్డపై రాణించే శక్తి సామర్థ్యాలు భారత స్పిన్నర్ అశ్విన్‌కు ఉన్నాయని ఇంగ్లండ్ జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగ్గట్టు దూకుడుగా బౌలింగ్ వేసే అశ్విన్ జట్టుకు లాభపడగలడని అన్నాడు. ‘నా ఉద్దేశం ప్రకారం అతడు లార్డ్స్ టెస్టులో అతడిని ఆడించాల్సింది. విదేశాల్లో తగినంతగా అశ్విన్ బౌలింగ్ చేయలేదు. అందుకే తనపై తొందరగా ఓ అంచనాకు రావద్దు. భారత్‌లో అశ్విన్ రికార్డు అద్భుతంగా ఉంది. అక్కడ బాగా బౌలింగ్ చేయగల వాడు ఇంకెక్కడైనా రాణించగలడు. చివరి రోజు ఆటలో తను ప్రత్యర్థి ఆటగాళ్లను ఇరుకున పెట్టగలడు’ అని స్వాన్ చెప్పాడు. -
క్రికెట్‌కు స్వాన్ గుడ్‌బై
మెల్బోర్న్: ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ఆదివారం గుడ్‌బై చెప్పాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. ‘అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెబుతున్నా. చాలా సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టు నా కుటుంబంలా వ్యవహరించింది. నా నిర్ణయం కఠినమే అయినా వైదొలగడానికి ఇదే సరైన సమయం’ అని స్వాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 2008లో భారత్‌పై అరంగేట్రం చేసిన 34 ఏళ్ల స్వాన్ ఇంగ్లండ్ తరఫున 60 టెస్టులు ఆడి 1370 పరుగులు, 255 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 104 వికెట్లు తీసి 500 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.