
లండన్: ఇంగ్లండ్ క్రికెట్‌లో కెవిన్ పీటర్సన్ ఒక దిగ్గజ ఆటగాడైతే, గ్రేమ్ స్వాన్ కీలక స్పిన్నర్‌గా చాలాకాలం కొనసాగాడు. అయితే తామిద్దరం కలిసి ఆడిన సందర్భాల్లో ఒకరంటే ఒకరి ఇష్టం ఉండేది కాదని, తమ మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండేది కాదని అంటున్నాడు గ్రేమ్ స్వాన్. ఒకే జట్టులో ఉన్నా పీటర్సన్‌కు, తనకు పరస్పరం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలుండేవనే విషయం క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసన్నాడు. కాగా, పీటర్సన్ జట్టులో ఉండాలని తాను కోరుకునే వాడినని స్వాన్ పేర్కొన్నాడు. పీటర్సన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మితిమీరిన నిబంధనలను ఇష్టపడే వాడు కాదని స్వాన్ తెలిపాడు. (‘నాకు చెల్లి ఉంటే స్టోక్స్‌కి ఇచ్చి పెళ్లి చేసేవాడ్ని’)
‘జట్టులో పీటర్సన్ ఉండాలని నేను కోరుకునే వాడిని. ఎందుకంటే అతడు భారీ స్కోర్లు చేసేవాడు. బాగా ఆడేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతడు ఒకడు’అని స్వాన్ చెప్పాడు. కాకపోతే వ్యక్తిగతంగా మాత్రం ఒకరంటే ఒకరికి పడేది కాదన్నాడు. ఎందుకో పీటర్సన్ అంటే తనకు ఇష్టం ఉండేది కాదని, అలానే పీటర్సన్ కూడా తనతో సఖ్యతగా ఉండేవాడు కాదన్నాడు.
2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా, 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. (‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’)
Comments
Please login to add a commentAdd a comment