T20 World Cup 2021: Wasim Jaffer Funny Trolls On Kevin Pietersen After NZ Beats Eng
Sakshi News home page

Eng Vs Nz: ఆ రెండు జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్‌ ఖలీఫా చూడటానికి వచ్చాం!

Published Thu, Nov 11 2021 4:16 PM | Last Updated on Thu, Nov 11 2021 4:57 PM

T20 World Cup 2021: Wasim Jaffer Funny Troll On Kevin Pietersen After NZ Beats Eng - Sakshi

Wasim Jaffer Funny Troll On Kevin Pietersen After NZ Beats Eng: ‘‘కేవలం పాకిస్తాన్‌.. లేదంటే అఫ్గనిస్తాన్‌ ఇంగ్లండ్‌ను ఓడించగలవు’’... టీ20 ప్రపంచకప్‌-2021లో ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టగానే.. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ చేసిన ట్వీట్‌ ఇది. గ్రూపు-1లో టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు... గ్రూపు-2లోని పాకిస్తాన్‌.. లేదంటే అఫ్గనిస్తాన్‌కు సెమీస్‌లో తమతో తలపడే అవకాశం ఉందని అతడు భావించాడు. కానీ.. పీటర్సన్‌ అంచనా తప్పింది. 

అనూహ్యంగా అద్భుత విజయాలు సాధించి.. గ్రూపు-2లో రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకువచ్చింది న్యూజిలాండ్‌. అంతేకాదు వరుస విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. సెమీ ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో మోర్గాన్‌ బృందాన్ని ఓడించి.. సగర్వంగా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. డారిల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌... కెవిన్‌ పీటర్సన్‌ను అదిరిపోయే మీమ్‌తో ట్రోల్‌ చేశాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్న ఫొటోపై.. ‘‘హా.. మేము ఇక్కడికి కేవలం బూర్జ్‌ ఖలీఫా చూడటానికి వచ్చాము మరి’’ అని రాసింది. పీటర్సన్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన వసీం జాఫర్‌ ఈ మేరకు మీమ్‌తో సెటైర్‌ వేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. వసీం జాఫర్‌ హాస్య చతురత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి!

చదవండి: James Neesham: సెలబ్రేట్‌ చేసుకోని జిమ్మీ నీషమ్‌.... ఫొటో వైరల్‌.. పని పూర్తైందా? ఇంకా లేదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement