T20 WC 2021: Kevin Pietersen Says Pakistan Or Afghanistan Teams Can Beat England - Sakshi
Sakshi News home page

Kevin Pietersen: ఇంగ్లండ్‌పై గెలవగల సత్తా ఆ రెండింటికే.. కప్‌ మాత్రం మాదే!

Published Tue, Nov 2 2021 3:16 PM | Last Updated on Tue, Nov 2 2021 4:42 PM

T20 WC 2021: Kevin Pietersen Says 1 Of These 2 Teams Can Beat England - Sakshi

Kevin Pietersen- Only These Teams can beat England : టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు... సమిష్టిగా ముందుకు సాగుతూ శ్రీలంకపై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంగ్లండ్‌ జట్టు. ఆల్‌రౌండర్‌ ప్రదర్శన కనబరిచి అధికారికంగా సెమీస్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది.  బలమైన జట్టుగా మారి ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది. 

గ్రూపు-1 టాపర్‌ అయిన మోర్గాన్‌ బృందం సెమీస్‌లో తమతో తలపడే గ్రూపు-2లోని జట్టు కోసం ఎదురుచూస్తోంది.  మరోవైపు.. గ్రూపు -2లో పాకిస్తాన్‌.. టీమిండియా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌లపై విజయాలతో ముందంజలో ఉండగా.. అఫ్గన్‌ సైతం స్కాట్లాండ్‌, నమీబియాపై విజయాలతో జోరు మీద ఉంది. న్యూజిలాండ్‌ సైతం భారత్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో  ఇంగ్లండ్‌ను ఓడించగల సత్తా పాకిస్తాన్‌ లేదంటే అఫ్గనిస్తాన్‌కే ఉందన్నాడు. అయితే, పిచ్‌ ప్రభావం పైనే జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నాడు.

ఈ మేరకు... ‘‘కేవలం పాకిస్తాన్‌.. లేదంటే అఫ్గనిస్తాన్‌ ఇంగ్లండ్‌ను ఓడించగలవు. కానీ... కా.... నీ... షార్జాలో ఇది వరకు ఉపయోగించిన పిచ్‌పై మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది’’ అని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు. అదే విధంగా..  ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని చెల్సీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఇంగ్లండ్‌ జట్టుకు పోలిక తెచ్చిన పీటర్సన్‌... కప్‌ గెలవాలని ఆకాంక్షించాడు. 

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో విభేదాలు.. కోహ్లి అనుకూల, వ్యతిరేక గ్రూపులు: అక్తర్‌
KL Rahul: కోహ్లి, రోహిత్‌ శర్మకు విశ్రాంతి.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement