
నేడు ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ పోరు
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ముందుకెళ్లేందుకు ఇంగ్లండ్ కీలకమైన పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో బట్లర్ బృందం అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. తొలి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాపై 350 పైచిలుకు స్కోరు చేసినా బౌలింగ్ వైఫల్యంతో ఓడిన ఇంగ్లండ్... లోపాల్ని సవరించుకొని అఫ్గాన్‌తో సమరానికి సిద్ధమైంది. ఓపెనర్ బెన్ డకెట్, జో రూట్, కెపె్టన్ బట్లర్, ఆర్చర్‌లు జోరు మీదున్నారు.
రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నబీలతో కూడిన ప్రత్యర్థి స్పిన్ త్రయంపై జాగ్రత్తగా ఆడితే పరుగుల వరద పారించొచ్చు. వుడ్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్‌లతో ఉన్న బౌలింగ్ దళం పరుగుల నిరోధంపై దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్ తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఘోరంగా ఓడింది. సఫారీకి 300 పైచిలుకు పరుగులు సమరి్పంచుకున్న అఫ్గాన్ కనీసం 50 ఓవర్ల కోటా కూడా ఆడలేక 208 పరుగులకే కుప్పకూలింది.
టాపార్డర్‌లో గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. రహ్మత్ షా ఒక్కడే బాధ్యత కనబరిచాడు. కీలకమైన పోరులో జట్టంతా కలిసి సమష్టిగా సర్వశక్తులు ఒడ్డితేనే గట్టి ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఎదుర్కోవచ్చు లేదంటే ఏ ఒక్కరిద్దరి ప్రదర్శనను నమ్ముకుంటే మాత్రం గత ఫలితమే మళ్లీ పునరావృతం అవుతుంది.
తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, జేమీ స్మిత్, రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్.
3 ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగానే ఈ మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్ (2015, 2019లలో) రెండుసార్లు, అఫ్గానిస్తాన్ (2023లో) ఒకసారి గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment