బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
🚨 BATTING COACH FOR INDIA. 🚨
- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2025
44 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.
తన కెరీర్‌లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.
2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఏడు వికెట్లు కూడా తీశాడు.
రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్‌లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.
కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)
భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)
మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)
Comments
Please login to add a commentAdd a comment