ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సైకిల్ తుది అంకానికి చేరుకుంది. బుధవారం(జూన్ 7) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సైకిల్ ముగియనుంది. ఇక లండన్ వేదికగా జరగన్న తుదిపోరులో భారత్- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాని స్వాన్ అన్నాడు. ఓవల్ మైదానంలో జూన్ ఆరంభంలో మ్యాచ్ జరగుతుంది కాబట్టి పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉందని, పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో జియో సినిమాతో స్వా్న్ మాట్లాడుతూ.. ఓవల్ పిచ్‌పై గ్రాస్ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓవల్ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరిగానే ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్‌లను తీసుకువస్తే బాగుంటుంది.
ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్ డిఫెండ్ చేసుకోవడానికి భారీ స్కోర్ సాధించాలి. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్ క్లాస్ టీమ్స్. కానీ ఒక ఇంగ్లీష్ మ్యాన్‌గా ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే చూడాలని ఉంది. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్ బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఆసీస్‌కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని పేర్కొన్నాడు.
చదవండి: WTC Final 2023: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. భరత్‌కు అవకాశం దక్కేనా? మరి అశ్విన్!
Comments
Please login to add a commentAdd a comment