ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లో విజయం సాధించడంతో కంగారూ జట్టు కూడా టీమిండియాను చూసి భయపడుతుందని కోహ్లి తెలిపాడు.
కాగా 2018-19 ఆసీస్ టూర్‌లో కోహ్లి కెప్టెన్సీలో టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లినే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి స్వదేశానికి రావడంతో రహానే టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు.
"టెస్టు క్రికెట్ తొలి రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారింది. అప్పటి నుంచి మమ్మల్ని ఆసీస్ జట్టు తేలికగా తీసుకోవడం లేదు.
వారి గడ్డపై కూడా మేము గట్టి పోటీని ఇచాం. అలా అని ఆసీస్‌ను మేము కూడా తేలికగా తీసుకోం" అని కోహ్లి పేర్కొన్నాడు.అదే విధంగా ఓవల్ మైదానం గురించి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే చాంపియన్‌గా నిలుస్తుంది అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: WTC Final 2023: అశ్విన్ వర్సెస్ ఉమేశ్ యాదవ్.. రోహిత్‌కు కఠిన పరీక్ష!
Comments
Please login to add a commentAdd a comment