రెండునెలల పాటు ఐపీఎల్‌తో పూర్తి బిజీగా గడిపిన విరాట్ కోహ్లి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా బ్యాచ్‌లుగా ఇంగ్లండ్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే పుజారా అక్కడికి వెళ్లి తన ప్రాక్టీస్ ఆరంభించగా.. డబ్ల్యూటీసీ టెస్టులో ఆడనున్న మిగతా టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్‌లుగా విడిపోయి ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు.
జూన్ 7న ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. కాగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం ఎలాగైనా ఆసీస్‌ను ఓడించి డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది.
తాజాగా కోహ్లి ఇవాళ(మే 26) ఉదయం సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. లండన్ మార్నింగ్స్ అంటూ క్యాప్షన్ జత చేసిన కోహ్లి లవ్ ఎమోజీతోపాటు సూర్యుడి ఎమోజీని కూడా జత చేశాడు. లండన్‌లో వాతావరణం ఎంతో బాగుంది తొలిరోజు ఆహ్లదకరంగా మొదలైంది అంటూ తెలిపాడు. కాగా గురువారం కోహ్లిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 250 మిలియన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఐపీఎల్ 16వ సీజన్‌లో కోహ్లి తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేశాడు. 14 మ్యాచ్‌లాడిన కోహ్లి 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు వరుస సెంచరీలు ఉండగా.. ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇదే ఫామ్‌ను చూపించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.
ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లోనూ కోహ్లి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టులో కోహ్లి 364 బంతుల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది. ఈ సిరీస్‌లో కోహ్లి నాలుగు మ్యాచ్‌లు కలిపి 297 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment