
ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుని 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క భారత బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. విరాట్ కోహ్లి (49), అజింక్య రహానే (46) విజయంపై ఆశలు రేపినా.. ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఇక ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రిప్టిక్ స్టోరీని పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం" అంటూ అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు.
కాగా ఐదో రోజు ఆటకు ముందు కూడా విరాట్ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి" అంటూ ఇన్‌స్టాలో క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు.
Instagram story of Virat Kohli. pic.twitter.com/sv0iFAzqtc
— Johns. (@CricCrazyJohns) June 11, 2023