మ‌ళ్లీ అదే త‌ప్పు చేసిన విరాట్‌ కోహ్లి.. వీడియో వైర‌ల్‌ | IND Vs AUS: Virat Kohli Gets Exposed Again With Boland's Ego Shattering Delivery, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND vs AUS: మ‌ళ్లీ అదే త‌ప్పు చేసిన విరాట్‌ కోహ్లి.. వీడియో వైర‌ల్‌

Published Fri, Jan 3 2025 9:11 AM | Last Updated on Fri, Jan 3 2025 9:52 AM

Virat Kohli Gets Exposed Again As Boland Kills His Ego

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు.

మరోసారి కోహ్లి వీక్‌నెస్‌ను ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ సొమ్ము చేసుకున్నాడు. 31 ఓవర్‌లో బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని వెంటాడి మరి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని బోలాండ్.. విరాట్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. 

ఆ డెలివరీని కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో థర్డ్ స్లిప్‌లో ఉన్న ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో చేసేదేమి లేక కోహ్లి(17) నిరాశతో మైదానాన్ని వీడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్‌సైడ్ బంతులకు కోహ్లి ఔట్ కావడం ఇది ఏడో సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 43 ఓవర్లు ముగిసే భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement