బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనతో ముగించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు(ఐదో టెస్టు)లోనూ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కనబరిచాడు.
కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కింగ్ కోహ్లి మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి దొరికిపోయాడు. విరాట్ కోహ్లి వీక్‌నెస్‌ను బోలాండ్ మళ్లీ క్యాష్ చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి సంధించాడు.
ఆ బంతిని హార్డ్ హ్యాండ్స్‌తో కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ సిరీస్‌లో కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. కాగా ఒకప్పుడు ఆఫ్ సైడ్ బంతులను అద్భుతంగా ఆడే కోహ్లి.. ఇప్పుడే అదే బంతులకు తన వికెట్‌ను కోల్పోతుండడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఏమైంది కోహ్లి నీకు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహం
The Scott Boland show is delivering at the SCG!
He's got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j— cricket.com.au (@cricketcomau) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment