క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ షురూ కానుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లు తమ తమ అస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.
అయితే 2017లో ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌లో పర్యటించినప్పుడు అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆసీస్ సారథి స్టీవన్ స్మిత్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా ఏం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.
ఏం జరిగిందంటే?
2017లో స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టింది. పూణే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ను ఏకంగా 333 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో టీమిండియాపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది.
అయితే ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ మధ్య వాగ్వాదం జరిగింది. డీఆర్ఎస్ విషయంలో స్టీవ్ స్మిత్‌తో కోహ్లి గొడవపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ వేసిన ఓ అద్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీకీ బౌలర్‌తో పాటు ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ వెలు పైకిత్తాడు.
ఈ క్రమంలో స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ.. డీఆర్ఎస్ కోరుకున్నాడు. దీంతో రూల్స్ వ్యతిరేకంగా నడుచుకున్న స్మిత్‌పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే రివ్యూ విషయంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటవంటి సాయం తీసుకోకూడదు. అయితే ఫీల్డ్ అంపైర్ కూడా స్మిత్ రివ్యూ నిర్ణయాన్ని తిరష్కరించాడు. అప్పటిలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది.
మ్యాచ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశాం..
ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు సార్లు అలా జరగడం చూశాను. నేను ఫీల్డ్ అంపైర్‌కు అప్పుడే చెప్పాను. ఆసీస్ ఆటగాళ్లు రివ్యూలు తీసుకునేముందు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తున్నారు. ఇదే విషయంపై మేము మ్యాచ్ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశాం. మళ్లీ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యింది. అక్కడి ఏమి జరిగిందో మొత్తం ఫీల్డ్ అంపైర్‌కు తెలుసు కాబట్టి రివ్యూ నిర్ణయాన్ని తిరష్కరించాడు అని పేర్కొన్నాడు.
చదవండి: ILT20: తీవ్రంగా గాయపడ్డ వెస్టిండీస్ క్రికెటర్.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
Comments
Please login to add a commentAdd a comment