
ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రూలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. భారత్ తమ చారిత్రత్మక విజయానికి 280 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (44), రహానే(20) పరుగులతో ఉన్నారు.
ఇక కీలకమైన ఐదో రోజు ఆటకు ముందు విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రిప్టిక్ స్టోరీని పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు.
కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి" అంటూ అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లి ఎందుకు ఈ పోస్టు చేశాడో అర్ధం కాక బుర్ర చించుకుంటున్నారు.
చదవండి: WTC Final: ఓవల్ పోరులో గెలుపెవరిది? టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?